పుట:Paul History Book cropped.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దేవుడు ఈ ప్రణాళికను నిర్ణయించాడు. కాని ఆదిమ కాలంలో దాన్ని గుప్తంగా వుంచాడు. అటుతర్వాత ప్రవక్తలద్వారా, అపోస్తలుల ద్వారా దాన్ని బయలుపరచాడు. యూదులు అన్యజాతివాళ్లు కూడ క్రీస్తు నుండి రక్షణం పొందాలనేదే ఈ ప్రణాళిక. ఇప్పడు దేవుడు పౌలుకి ఈ రహస్య ప్రణాళికను తెలియజేసాడు. దాన్ని ఎల్లరికి బోధించడానికి అతన్ని నియమించాడు. కనుక నరులు పౌలు బోధను వినాలి.

5. క్రీస్తురక్షణం

క్రీస్తు తన మరణోత్థానాల ద్వారా మనలను రక్షించాడు. ఈరక్షణాన్ని పౌలు నానావర్ణనలతోను ఉపమానాలతోను వివరించాడు. తండ్రి క్రీస్తురక్షణం మన విూద పలువిధాలుగా, సోకేలా చేసాడు. కనుక తండ్రీ క్రీసన్గా ఇద్దరూ మనకు రక్షకులే. పౌలు వివరించిన రక్షణకార్యాన్ని పది అంశాల క్రింద విభజించి చూడవచ్చు. ఇక ఈ విషయాలను క్రమంగా పరిశీలిద్దాం.

1. సరులను నీతిమంతులను జేయడం

క్రీసు రక్షణం నరులను నీతిమంతులనుగా, అనగా దోషరహితులనుగా చేసింది. ఈ భావాన్ని విపులంగా పరిశీలిద్దాం.

ఇక్కడ "నీతి" అంటే నిర్దోషత్వం, పాపరాహిత్యం. ఈ నీతికి హీబ్రూలో "సెడెకా"అనీ, గ్రీకులో "దికాయెుసునీ" అనీ, ఇంగ్లీషులో Justification అని పేరు. మొదట పూర్వవేద భావాలను పరిశీలిద్దాం. హీబ్రూ బైబుల్లో 'నీతివుంతుడు' అంటే న్యాయస్థానంలో న్యాయాధిపతి నిర్దోషి అని తీర్పుచెప్పినవాడు. ఆలాంటి నరుడు దోషరహితుడు. ఈలాగే యావే ప్రభువు ధర్మశాస్ర ఆజ్ఞలను పాటించినవాళ్లను నిర్దోషులనుగా గణిస్తాడు. తన