పుట:Paul History Book cropped.pdf/31

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


కొరకు క్రీస్తు స్వర్గంలో తండ్రిని మనవి చేస్తుంటాడు-రోమా 8,34. రక్షణం మన పుణ్యక్రియల వల్ల లభించదు. క్రీస్తు పట్ల మనకున్న విశ్వాసం వల్ల లభిస్తుంది. అది దేవుడు మనకు ఉచితంగా యిచ్చే వరం-ఎఫె 2,8-10.

రక్షణం క్రీసు రాకడతోనే ప్రారంభమైంది. కాని అది పరలోకంలోగాని ముగియదు. ఇప్పడు మనం పొందేది పాక్షిక మైన రక్షణం మాత్రమే. సంపూర్ణ రక్షణం ప్రభువు రెండవసారి విజయం చేసినపుడు లభిస్తుంది. కనుక మనం క్రీస్తు రెండవరా కడ కొరకు ఎదురుచూస్తుండాలి - ఫిలి 3,20. ఇప్పడు మనం ఆశద్వారా మాత్రమే రక్షణం పొందుతాం. పూర్తిరక్షణం తర్వాత వస్తుంది.

రక్షణం దేవుడు ఇచ్చేదైనా మన సహకారం గూడ అవసరం. కనుకనే పౌలు విూరు భయంతో గడగడ వణుకుతూ మి రక్షణాన్ని సంపాదించుకోండి అన్నాడు - ఫిలి 2,12. అందుచే మన తరపున మనం సోమరితనంగా కాలం గడపకూడదు. ఇప్పడే రక్షణకాలం -2కొరి 6,2. ఇక్కడున్న అవకాశాలను వినియోగించుకొని రక్షణాన్ని పొందాలి. దాన్ని సంపాదించుకోకపోతే మన జీవితం వ్యర్థమైనట్లే.

అన్ని మతాల్లో రక్షణం అనే భావంవుంది. హిందువులు దాన్ని "ముక్తి" అంటారు. అనగా పునర్జన్మను విడిపించుకొని దేవుణ్ణి చేరడం.

3. నరులు దేవునితో రాజీపడ్డం

రాజీ పడ్డానికి గ్రీకుమాట ‘కటలాగే". గ్రీకు రోమను మతాల్లో దేవతలు నరులు ఒకరితో ఒకరు సఖ్యపడ్డం కన్పిస్తుంది. దీనివలన విరోధులు మిత్రులౌతారు. దూరపువాళ్లు దగ్గరివాళ్లు ఔతారు.

పౌలు ఈ భావాన్ని క్రీస్తుక్తిత్రాన్వయించాడు. దేవుడు పాపం