పుట:Parama yaugi vilaasamu (1928).pdf/532

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సప్తమాశ్వాసము.

515


కావేరినిలయకైంకర్యంబు లాఱు
గావింతు ననుచు సంకల్పంబు చేసి
గట్టిగా సాలయుగ్మము మహానసముఁ
గట్టించి నాల్గవకలుకోటఁ దీర్చ
సవరింప దొరఁకొనుసమయంబునందు
భువి నెన్నఁదగినశిల్పులు [1]ననిశంబు
[2]ఘనులైన మఱి తక్కుఁ గలిగినమేటి
పనులవారల బడి పనులవారలును
పరువడిఁ దమతమపనులకు నమరి
దొరఁకొని సేయంగఁ దొడరునత్తఱిని
బలువుకొండలు రేకబడ నింత మలఁచి
యులువకట్టులువోసి యులు లోలి నాటి
పసలుమించఁగ సూత్ర పట్టినపగిది
విసువక గసివోటు వేయువారలును
గూటంబు లులులుఁ జేకొని యవలీల
గాటంపుకొండ లొక్కట వ్రీలి వ్రాల
ననయంబు వెఱఁ గంది యనిమిషశిల్పి
గని యోటువడుచుండ గనివోటు వైవఁ
గప్పుల దూలముల్ కంబాలు వలుద
చప్పటిరాలు నచ్చంపుబోదియలు


  1. నీమిదంబు, నిమఁదంబు
  2. ఘనులౌచు