పుట:Parama yaugi vilaasamu (1928).pdf/533

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

516

పరమయోగివిలాసము.


[1]కదరికాద్వారశాఖలు కొణంగెలును
మొదలైన సంపాదములు చిత్రగతులఁ
బడి పనివాండ్రు నిబ్బరమున సన్న
బడియలుపూని సంభ్రమము రెట్టింప
లావునం గదిసి [2]హేలల్ల యటంచు
మేవీది వడి బండ్లమీఁది కెత్తుచును
ఆరీతిఁ బోవనియట్టిదూలములు
చేరి మూఁకలు గట్టి చిట్టెలు గట్టి
యెగదిగరవముల హేలల్ల యనుచు
నగపడి యవి మోచి యరుదెంచి వారు
ధర జలాంతము శిలాంతముగ శోధించి
వరుసలోపల [3]గుండ్రవక్త్రంబు సేసి
యిసుము జల్లియు వైచి యెనయ గట్టించి
వసిబారి మాకున వడిఁ గూరుకొనుచుఁ
జప్పటి గావించి చదురపానంబు
నొప్పుగావించి మై నొక్కొక్కరాయి
వరుస నిల్పుచు రసవర్గంబుతోడ
బెరయించి యిట్టికెపెట్టజల్లియును
సందడి బొక్కలో సందుసందులను
దందడిగొనఁగ బెందడివేయువారు


  1. కదలని
  2. హెల్లల్ల
  3. గుండ