పుట:Parama yaugi vilaasamu (1928).pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

iii

సంగీతసాహిత్యవిద్యలయందుఁ బండితులఁట. అశ్వలాయనసూత్రము, భారద్వాజసగోత్రము, నందవరీకశాఖ యని చెప్పియున్నాఁడు. తాతయగు నన్నయ్య పదకవిత్వవిశారదుఁ డఁట. ఆతని పదకవిత్వలక్షణములఁ బినతిమ్మయ్య "సంకీర్తలక్షణము" లను చిన్నపుస్తకముగా రచించెను. అది యాంధ్రసాహిత్యపరిషత్పత్రికలొ ముద్రింపఁబడెను. తండ్రియగు పెదతిరుమలయ్య 1. ఆంధ్రవేదాంతము, 2. ద్విపదహరివంశము, 3. చక్రవాళమంజరి, 4. రేఫరకారనిర్ణయము ననుగ్రంధములను రచించెను. 3, 4 గ్రంధములు పైపరిషత్పత్రికలోనే ప్రకటింపఁబడినవి. (పెదతిరుమలయ్య రచించిన యాంధ్ర భగవద్గీతావ్యాఖ్యాన మొండు గాన్పించుచున్నది. అదియే యాంధ్రవేదాంతమై యుండును.) హరివంశము మృగ్యము. తిరుమలయ్య "మండెము" కోటలోనుండువాఁడఁట. మండెముకోట కర్ణాటాంధ్రదేశమధ్యస్దమై యొక్కయెడ నుండినటులఁ జరిత్రమువలనఁ దెలియవచ్చుచున్నది. పితామహుడయిన యన్నయ్య కృష్ణదేవరాయుని కాలమునం దుండి కొన్నియగ్రహారములను సంపాదించెనని శ్రీవీరేశలింగము పంతులుగారు వ్రాసియున్నారు. కాని యందుల కాధారము చూపలేదు. తిరుపతిలొని యొకశాసనము ననుసరించి యన్నయ్య శ్రీనాధునినాఁటివాఁడై యుండెనని బ్ర॥ శ్రీ వేటూరి ప్రబాకరశాస్త్రిగారు శృంగారశ్రీనాథములో వ్రాసి