పుట:Parama yaugi vilaasamu (1928).pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కగ్రంథమునుగూడ నీతఁడు రచించెను. రెండును ద్విపదకావ్యములే. ఈతనికిఁ "జిన్నన్న" యను మాఱుపేరు కలదందురు. శ్రీ రావుబహద్దర్ కందుకూరి వీరేశలింగముపంతులు గారు కవులచరిత్రయందు "తాళ్ళపాక చిన్నన్న" యనునాతఁడు "అష్టమహిషీకల్యాణము" వ్రాసెననియుఁ దమకా గ్రంథము లభింపలేదనియు "తాళ్ళపాక తిరువేంగళనాథుఁడు" పరమయోగివిలాసము వ్రాసెననియు వేర్వేఱుకవులనుగా గ్రహించిరి. దీనిఁకిగారణ మప్పటి కష్టమహిషీకల్యాణము వారికి లభింపకపోవుటచేతనే యయియున్నది. అష్టమహిషీకల్యాణ మిపు డాంధ్రసాహిత్యపరిషత్కార్యస్థానమునం గలదు. దానిం జదివినచోఁ జిన్నన్న వేఱు తిరవేంగళనాథుఁడు వేఱుకాక రెండుగ్రంథములను రచించినవాఁ డొక్కరుఁడె యని మనకుఁ దెలియనగును. అష్టమహిషీకల్యాణ గ్రంథమునందు నీతని చరితము విపులముగాను, పరమయోగి విలాసమునం గౢప్తముగాను జెప్పఁబడెను. ఈతనితాత "అన్నయ్య" తండ్రి తిరుమలయ్య. (ఇతనికిఁ బెదతిరుమలయ్య యను నామాంతరము గలదు) అన్నలు 1 పినతిమ్మయ్య, 2 అన్నయాచారి, 3 తిరువేంగళయ్య. తమ్ముడు కోనేటి వేంకటనాథుఁడు. పినతండ్రి నరసింహుఁడు. (ఈతనికి నరసింగన్నయని పేరు కూడ కలదు.) పినతండ్రికుమారుఁడు 1 నారాయణుఁడు, 2 అన్నయ్య, 3 అప్పలార్యుఁడు వీరందఱు