ఈ పుటను అచ్చుదిద్దలేదు
శంకరాచార్యుని ఇట్టిమహిమలు ఇంకా అనేకంగా ఉన్నాయి. వానిని శ్రీదైవజ్ఞలుడు కోటేశ్వరశర్మ శాస్త్రి 'శ్రీమచ్చంకర బవవత్పాదాచార్యుల ' చరిత్ర మున్నగు వాన యందు చూడదగును.
శంకరాచార్యుడు ఉత్తర భారతదేశ సంచారము చేయు సందర్భంలో కాశ్మీరదేశంఝ్లో శారదాదేవి పీఠం ఒకటి ఉందనీ, ఆ మఠానికి నాలుగు దిక్కులా నాలుగు ద్వారాలు ఉన్నాయనీ, సర్వజ్ఞుడయిన వాడు కాని ఆ ద్వారాలు తెరవచాలడనీ, తూర్పు, పడమటి, ఉత్తరద్వారాలు ఆయాదిక్కులనుండి పండితులు వచ్చి తెరిచారనీ, దక్షిణ ద్వారం తెరవగల దక్షిణప్రాంత పందితుడు ఇంతవరకు రాలేదని, అది తెరవగల పండితుడు లేనందున ఆ ద్వారం అట్లే మూతబది ఉందనే జనశ్రుతి విన్నాడు. అప్పుడు అతడు కాశ్మీరానికి వెళ్లి అక్కడి పండితులతో వాదించి దక్షిణ ద్వారం తెఱచుకునేటాట్లు చేసి విశేషకీర్తిని పోందాడు.
పిమ్మట శంకరాచార్యుడు మతకార్యనిర్వహణార్ధము భారతదేశం నాలుగు మూలలా నాలుగు మఠాలు స్థాపించాడు. తూర్పున జగన్నదంలో గోవర్ధన మఠం, పడమట ద్వారకలో శారదామఠం, ఉత్తరాన కేదారములో జ్యోతిర్మఠం, దక్షిణాన శృంగేరిలో శృంగగిరి మఠం స్థాపించాడు. అతడు కేదారాన నివశిస్తూ ముప్పది రెండో ఏట కైలాసగమనం ఛేశాడు.
శంకరుని విషయంలో కొన్ని వి?శిష్టతలు ఉన్నాయి. బ్రహ్మచర్యాశమం నుండే అతను సన్యాసాశ్రమం స్వీకరింఛాడు. సన్యాశి అయి ఉండిన్నీ తల్లికి అంత్యక్రియను చేశాడు. దెబ్బైయి రెండు మతాల వారిని జయించాడు. శరాధికమైన ఉద్గ్రంధాలు రచించాడు. ఇది అంతా ముప్పైరెండేళ్లలో అతను పూర్తిచేశాడు. అతడు శంకరాచార్యుడు అనే ప్రధితయశాన్ని అందాడు. అతడు స్థాపించిన పీఠాధిపతులకు కూడ శంకరాచార్యనామం అనంతకాలాన ఉట్టంకింపపడుతూ రాగా అతనికి ఆదిశంకరులు అనే పేరు వచ్చింది.
అతడు అద్వైత మత స్థాపనాచార్యుడు. అద్వైతమతము వేదాలలో, ఉపనిషత్తులలో, భగవద్గీతలలో ఉన్నదే. ప్రజలు దానిని మరిచిపోగా శంకరుడు తిరిగి దానిని వెలార్చెను. బౌద్ధమతములోని మంచి సిద్ధాంతాలను కూడ ఇందు చేర్చేను. అందుచేత దీనికి ప్రచ్చన్న భౌద్ధం అనే పేరు వచ్చింది.