Jump to content

పుట:PandugaluParamardhalu.djvu/97

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శంకరుడు వ్యాసునితో మీసమక్షాన ఈ మణి కర్ణికా క్షేత్రంలో ఈ శరీరాన్ని వదలవలనని అనుకుంటున్నాను అనెను. దానికి వ్యాసుడు "శంకరా! నీవు చేయవలసిన పని ఇంకా ఉంది. ప్రతి వాదులను జయించి అద్త్వత సిద్ధాంతాన్ని ప్రచరం చేయవలసి ఉంది. నీకు ఆదిలో ఈశ్సరుడు ఎనిమిది సంవత్సరాల ఆయువు ఇచ్చాడు. నీ శక్తి వలన ఎనిమిద్ సంవత్సరాల ఆయుర్ధాయం నీవు అదనంగా ఆర్జించుకొన్నావు. ఇప్పటి నుండి మరి ఒక పదహారు సంవత్సరాల ఆయుర్ధాయం నీకు పరమేశ్వరుడు ఇస్తాడు" అని వ్యాసుడు అంతర్ధానమయ్యాడు.

     అటు పిమ్మట కాలడిలో ఆర్యాంబకు అవసానకాలము ఆసన్నమయ్యెను. ఆమె కుమారుని తలచుకొనెను. అతదు వెంటనే తల్లి చెంతకు వెళ్లి ఆమెకు వలయు ఉపచారాలు చేసెను.  ఆమె మరణింపగా తాను సన్యాసి అయి ఉండిన్నీ దహనాది కర్మలు స్వయంగా చేశాడు.  సన్యాసి చేయకూడని పని అని కులమువారు తప్పు పట్టిన అతడు అంతగా పట్టించుకోలేదు.
    అటు పిమ్మట శంకరుడుశిష్యులతో దిగ్విజయార్ధము బయలు దేరి భారతదేశమంతా తిరిగాడు.  మండన మిశ్రుని జయించాడు.  అతడు శంకరుని శిష్యత్వమంగీకరించి సురేశ్వరాచార్యుడనే కొత్తపేరు స్వీకరించాడు.  గొకర్ణక్షేత్రసమీపమున బలి అగ్రహారంలో ప్రభాకరుడనె వాదు అద్వైతాన్ని హస్తామలకం వతుగా విప్పి చెప్పగా అతనిని హస్తామలక నామంతో సంబోదించి శిష్యునిగా స్వీకరించాడు.
    శంకరుని శిష్యులలో గిరి అను పేరిటవాడు కొంచెము మందమతి చదువు మీద కంటె గురు శుశ్రూషమీద అతడు శ్రద్ధచూపువాడు.  ఒకనాడు శిష్యుడు శమక్రుని వద్దకు వచ్చి భాష్యపాఠము ప్రారంభింప నుండిరి. గిరి గురువు కాషాయ వస్త్రాలు ఉతుకుతూ అప్పటికి ఇంకా రాలేదు.  గిరి వచ్చేవరకు కాస్తతాళండి అని గురువు అన్నాడు.  మందబుద్ధి అయిన గిరి వచ్చేవరకు ఉండడం అనవసరం అనే ధోరణిలో శిష్యులు మాట్లాడారు. ఈశిష్యులు గర్వాన్ని శంకరుడు గుర్తించాడు.  తన అద్భుత మహిమ చేత గిరికి పదునాలుగు విద్యల్లో పాండిత్యం అలవడేటట్లు చేశాడు.  అంతట అతడు తోటక వృత్తాలతో అద్వైతత్త్యమంతా విడమర్చివర్ణించాడు.  మిగతాశిష్యులు ఆశ్చర్య చకితులు అయ్యారు.  గిరి అప్పటి నుంచి తోటకాచార్యుడనే ప్రసిద్ధినందాడు.