Jump to content

పుట:PandugaluParamardhalu.djvu/99

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వైశాఖ శుద్ధ షష్ఠి

                     రామానుజాచార్య జయంతి
     వైశాఖ శుద్ధ షష్టి రామానుజాచార్య జయంతి దినము.  శంకర, రజమానుజ, మధ్వ అను త్రిమతాచార్యులలో అతను రెండవవాడు. విశిష్టాద్వైత మతోద్ధారకుడు.
    అతడు క్రీస్తు శకము 1017లో నలనామసంవత్సరం వైశాఖ?శుద్ధ షష్టీ గురు వరము నాడు జనన మందెను.  తండ్రి ఆసూరికేశవ పెరుమాళ్. తల్లి భూమి సిరట్టియార్, చెన్నపురి చెంతగల శ్రీ పెరంబూరు అతని జన్మస్థలము.
    కేరళ పెరుమాళ్ కొడుక్కి ప్రాధమిక విద్య తానే చెప్పాడు.  తరువాత కాంచీ పురానికి పంపాడు.  అక్కడ అతడు యాదవ ప్రకాశులు అనే గురువు వద్ద వేదాం తం చదివాడు.  రామానుజుల చుట్టము గోవిందభట్టు కూడ అప్పుడు అక్కడే చదువు కుంటూ ఉండెను.
    యాదవ ప్రకాశుల వద్ద ఈ వేదాంతాభ్యాసము చిరకాలం సాగలేదు.  మూలమునకు వ్యాఖ్యానం చేయడంలో గురువుకి శిష్యుడికి అభిప్రాయాలు బేదించాయి.  స్థితి ఇట్లా ఉండగా స్థానిక రాజప్రముఖుని కూతురుని దయ్యము పట్తింది.  యాదవ ప్రకాశుడు ప్రయత్నీంచి తన మంత్ర శక్తి చేత దయ్యాన్ని వదల్చలేక పోయాడు.  అందుమీద రామానుజాచార్యులు ప్రయత్నించి తన మంత్ర శక్తి చేత రాజుకూతురు గ్రహ భాద వచిల్చాడు.
     అందుతో గురువుకి శిష్యుడు మీద ఊద పుట్టింది.  రామానుజుల్ని చంపి వేగడానికి కుట్ర తలపెట్టాడు.  గురువు కాశీకి ప్రయాణం కట్టాడు.  శిష్యుల్ని కూడా తీసుకువెళ్లి మార్గము మధ్యలో అతన్ని మట్టుపెట్టడానికి ఏర్పాటు, రామానుజుడికి తప్ప ఇతర శిష్యులకు ఈ విషయం తెలిసింది.  అందులో గోవిందభట్టు ఈ సంగతి రామానుజుడికి చెప్పేశాడు.  ప్రయాణం ఎంతో దూరం సాగలేదు.  ఒకరాత్రి రామానుజుడు తప్పించుకుని తిరిగిగచ్చి కంచికి చేరుకున్నాడు.
   అప్పుడు తల్లి ఉపదేశంపైన అతడు వివాహంచేసుకుని కంచి వరదరాజు స్వామి సేవలో కాలక్షేపం చేస్తూఉండినాడు.
    ఆవాళ్లలో శ్రీరంగంలోని వైష్ణవుల గురువైన ఆళవందారు