ఈ పుటను అచ్చుదిద్దలేదు
లక్ష్మీనారాయణపూజా (3) గౌరీ పూజా, త్రిలోచన గౌరీవ్రతం, (4) త్రేతాయుగాది (5) బలరామజయంతి (6) సింహాచలక్షేత్రే చందనమహోత్సవ: ' అని వ్రాస్తారు.
ఈ ఆరు విషయాలను క్రమంగా వివరించుకుందాము.
అక్షయ తృతీయనాడు పెరుగు అన్నము, విసనకఱ్ఱలు, గొడుగులు, పాదుకలు, చెప్పులు, ఉదకుంభము మున్నగునవి దానము చేయాలని చెప్పబడింది.
వైశాఖ మాసంలో 'వైశాఖపూజ ' అనే పేరుతో సంపన్న గృహస్థులు ఒక వ్రతం చేస్తూ ఉండిరి. అందులో వేసవికి అవసరమైనవి వేసవిలో బాగా దొరికే మామిడి పళ్లు, పనస తొనలు మున్నగునవి కూడ పంచిపెట్టేవారు.
వేసవికి అవసరమైనవి, వేసవిలో దొరికేవి అయిన వస్తువులు విరివిగా దానం చేయడం అక్షయ తృతీయయావ్రతం యొక్క ప్రధానోద్ధేశ్యమని ద్యోతకమవుతూ ఉంది.
ఉదకుంభదానము
ఈనాటికి విధాయక కృత్యాలలో ఉదకుంభదానము ఒకటి. వైశాఖమాసం నుంది ఎండలు మెండుగా ఉంటాయి. ఎండల రోజుల్లో కుండల్లో జాగ్రత్తపెట్టిన నీరు పుచ్చుకుంటే బాగా దాహశాంతికరంగా, ఆప్యాయంగా ఉంటుంది. కావుననే నీటితో నిండిన కుండల్ని ఈ కాలములో దానం చేయడం మతవిధుల్లో ఒకటిగా మన పెద్దలు నిర్ణయించారు. గ్రీష్మర్తుచర్యల్లో వాగ్భటుడు మిక్కిలి చల్లనైన యుదకమును మట్టి పాత్రలో బోసిన కలిగొట్టు పూలవలి చేర్చి వాసెనగట్టి పచ్చ కర్పూరమును చేర్చి మట్టి దుత్తతోడనే పానము చేయవలయును." అనివాకొనుచున్నడు. వాగ్భటుని ఈ ఆరోగ్యసూత్రమును పట్టి గ్రీష్మర్తుముఖస్థంలో అక్షయ తదియనాడు ఉదకుంభ దానాచారాన్ని ఏర్పఱిచిన మన పెద్దల లోకస్వాస్థ్య ప్రణవ బుద్ధిని మనము కొంతకు కొంత పోల్సుకోవచ్చును.
లక్ష్మీనారాయణ పూజ
స్మృతికౌస్తుభములో, తిధితత్వములో, పురుషార్ధ చింతామణిలో ఈనాడు విష్ణుపూజ చేయాలని కలదు.