Jump to content

పుట:PandugaluParamardhalu.djvu/83

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

త్రిలోచన గౌరీపూజ

    చైత్రశుక్ల తృతీయనాడు ప్రారంభించిన గౌరీపూజా వ్రతముకొన్ని ప్రాంతాలలో నెలరోజులపాటుసాగి ఈనాడు ముగుస్తుంది.  కావుననే పంచాంగంలో ఈనాటి వివరణలో గౌరీపూజ, త్రిలోచన గౌరీవ్రతము అని పేర్కొనబడి ఉంటుంది.
     సుభోదిని (25-4-36) పత్రికలో ఒకరు ఇది శైవ సంబంధమైన పర్వంగా ఇట్లు వ్రాస్తున్నారు.  "ఇది కార్తికేయ ప్రయుక్తమగు పర్వదినముగనున్నది. సామాన్యముగనీ దినమ్న కుమార స్వామికి (కార్తికేయునకు) అభిషేకోత్సవవారులు జరుగును.  శివాలయములలోనను విశేషముగ పూజాదులు చేయబడును."
                        యుగాదితిథి
  అక్షయ తృతీయ యుగారి తిధి, కృత, త్రేత, ద్వాపర, కలియుగము అనేనాలుగు యుగాల్లోనూ త్రేతాయుగానికి ఇది మొదటి రోజు.
   త్రేతాయుగ పరిమాణము నూటతొంబై ఆరువేల మానవసంవత్సరాలు.  శ్రీరామవతారము త్రేతాయుగానికి చెందింది.  అప్పటి మానవాయుర్ధాయం మూడు వేల సంవత్సరాలు.  శరీరంలో మాంసం ఉండే వ్రకు ప్రాణాలు ధరించి ఉంటారు.  త్రేతాయుగం రజత యుగం, అహననీయ, గార్హపత్య, దక్షిణములను త్రేతాగ్నులను పూజించిన కాలము కావడము చేత అది త్రేతాయుగమని అనబడింది.

సంవత్సరంలో ఇతర యుగాదులు ఇట్లున్నాయి.

            కృతయుగాది          కార్తికశుద్ధనవమి
            ద్వాపరయుగాది      మాఘకృష్ణ త్రయోదశి
           కలియుగాది           భాద్రపదకృష్ణ త్రయోదశ్.
      యుగాది తిధుల్లో సంద్రస్నానం  చేసి పితృశ్రాద్ధం జరిపే వారికి కురుక్షేత్రంలో వేయుగోవులను దానము చేసిన ఫలము కలుగుతుందని శాస్త్రవచనం.  ఈనాడు స్నానము, దానము, తపము, శ్రాద్ధము, హోమము చేయాలని వ్రతగ్రంధాల్లో వ్రాసి ఉంది.  శివ గంగ కైలాస హిమాలయ భగీరధపూజ లున్నూ ఈనాటి కృత్యాలు.
    ఈనాడు కల్పాది అని అమాదేర్ జ్య్హోతిషీ అనే గ్రంధం చెబుతోంది.