పుట:PandugaluParamardhalu.djvu/81

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తృతీయ అనే పేరు వచ్చింది. ఈ పర్వాన్ని గుఱించి శ్రీ కృష్ణుడు యుధిష్ఠరునకు ఈ విధముగా చెప్పినట్లు భవిష్యపురాణంలో ఉంది.

     "పూర్వకాలంలో దరిద్రుడు, ప్రియవారి, సత్యవంతుడు, దేవగురు జనభక్తుడు ఐన ఓక్ కోమటి ఉండెను.  అతను ఒకసారి వైశాఖమాస శుక్లపక్ష మహోత్స్యము పెద్దలు వలన విని అక్షయతృతీయనాడు గంగాస్నానం చేసి ఇంటికి వచ్చి దేవపూజచేసి లడ్లు, విసిని కర్రలు దానము చేశాడు.  ఆ కోమటి ఉతర జన్మలో కుశపతి నగరంలో ధనవంతుడైన ఒక క్షత్రియుని యింట పుట్టాడు.  ఆ జన్మలోనూ అతడు దాననిరతిని వీడలేదు.  ఎంతగా దానము చేస్తూ ఉన్నా అతని సమదక్షయం కాక అక్షయమవుతూ ఉండింది.  ఇది అంతా అక్షయ తృతీయ వ్రతాచరణ ప్రభావము.
    వ్రతోత్సవ చంద్రికాకారుడు ఈ వ్రత విధానాన్ని వివరిస్తూ విశేషాలు ఇట్లా తెలుపుతున్నాను.
   "ఈ రోజున గంగాస్నానము చేసేవారు సకల పాపవిముక్తులు అవుతారు.  పితృదేవతలకు తర్పణాదులు విడవాలి.  లక్ష్మీ సహితమైన నారాయణుని గౌరీసహితుడైన త్రిలోచనుని పూజించాలి.  ఆ పూజా సమయంలో విసనకర్రలు, లడ్లు పంచిపెట్టినవారు వైకుంఠాన్ని, శివలోకాన్ని పొందుతారు.  యవలతో అన్నం వండి దేవుడికి ఆరగింపు చేయాలి.  గురువులకు నవధాన్యాలు, గ్రీష్మఋతువులో లభ్యమయ్యే ఇతర వస్తువులతో కలిపి దానం చేయాలి.  ఈనాటి దానాల్లో జలపూరిత కుంభం ముఖ్యమైంది.  ఈనాడు ఒంటి పూటే భోజనం చేయాలి.
   ఈ వ్రతం కేవలం ధార్మిక గుణ సమన్నమైనది.  అందువల్ల ఈ పండుగ అట్లే ఆర్భాటంతో జరిగేది కాదు.  ఈ పర్వం హిందూ దేశం అంతటా ఉన్నది.  దేవాలయాల్లో ఈనాడు విగ్రహాలను ధవళవస్త్రాలు కడతారు."
    ఈ వివరణ వ్చల్ల ఈ రోజున తీర్ధస్నానము, తిలలతో పితృతర్పణం ఘటధాన ధర్మాలు, దైవపూజ విధాయకకృత్యాలని తెలుపుతూ ఉంది.
    ఈనాటి వివరణ వల్ల  ఈ రోజున తీర్ధస్నానము, తిలలతో పితృతర్పణం, ఘటదాన ధర్మాలు, దైవపూజ విధాయకకృత్యాలని తెలుపుతూ ఉంది.
  ఈనాటి వివరణలో పంచంగ కర్తళూ ఆక్షతృతీయా (1) దధ్వన్న వ్యజన చత్ర పాదుకోపాంజహదానాని ఉత కుంభదానం (2)