పుట:PandugaluParamardhalu.djvu/78

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కాని మావసుడు మాత్రం చలించలేదు. ఆమె కోరికను నిరాకరించాడు. ఆ కారణం వల్ల ఆనాటికి అమావాస్య అనేపేరు వచ్చింది. అది పితరుల పాలిటి పర్వదినంగా చెలామణి కాజొచ్చింది. ఆనాడు మానవులు పితరులకు భక్తి ప్రపత్తులతో తిలతర్పణాలు ఈయడం ఆచారంగా పెట్టుకున్నారు.

            మేషసంక్రాంతి
    ఈనాడు భార్గవరాముని పూజించి ఉపవాసము ఉండాలని హేమాద్రి చెబుతున్నాడు. సుజన్మావాప్తివ్రతం, సంక్రాంతి స్నానవ్రతం, నవాన్నశ్రాద్ధం మున్నగునవి ఈనాడు చేస్తారని వ్రతగ్రంధాలు చెబుతున్నాయి.
  మేషము,వృషభము, మిధునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృచ్చికం, ధనుస్సు, మకారం, కుంభం, మీనం, అని పన్నెండు రాసులు, ఒక్కొక్కరాశిలో సూర్యుడు ఒక్కొక్కమాసముండును. సూర్యుడు మేషరాశిలో ప్రవేశించే దినానికి మేష సంక్రాంతి అని పేరు.  మేష సంక్రాంతినుండి వృషభ సంక్రాంతి వరకు కల మాసమును మేషమాసమంటారు.

సౌరమాసము ప్రకారము మాసాలను లెక్కించే వారి మాసాల నామస్లు ఈ రాశులను పట్టి ఉండును. మేషసంక్రాంతి తమిళులకు సంవత్సరాది.ప్రతి సంక్రాంతి పితృదేవతలకు ప్రీతికరమైనరోజు. అశ్వనీ నక్షత్రగతుడై సూర్యుడు మేషరాశిలో ప్రవేశించు దినము మేషసంక్రమణ పుణ్యకాలము.

           కేరళదేశీయుల విషు
    సూర్యుడు మేషరాశిలో ప్రవేశించే రోజు అరవవారికి సంవత్సరాది కదా! అరవ వారికి పొరుగు వారైన కేరళులు కూడాదానిని గొప్పపర్వంగా జరుపుతారు. కేరళీయులకు ముఖ్యమైనవి మూడు పండుగలు అవి ఓనం, విషు, తిరుపతిర, మేష సంక్రాంతినాడు వారు జరిపే పండుగను వారు విషు అంటారు. ఓనం అనేదివారి ప్రధానపర్వం. దాని తరువాత గణనకు వచ్చేది విషు.
   విషు పర్వాన్ని వారు జరిపే తీరు విచిత్రంగా ఉంటింది. తెల్లవారితే విషు అనగా ప్రతి గృహయజమస్నురాలు ఇంట ఒకచోట