Jump to content

పుట:PandugaluParamardhalu.djvu/79

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఒక పెద్ద అద్దాన్ని పెడుతుంది. ఆ అద్దానికి రెండు పక్కల రెండు దీపాలు పెడుతుంది. అద్దానికి ముందు ముందుగా బంగారం ఊంచుతుంది. దాని ఇవతల వెండి ఆ పిమ్మట బియ్యం, కూరకాయలు, పళ్లు ఉంచుతుంది. ఈ ఏర్పాటును కేరళభాషలో 'విషుకవి ' అంటారు.

                తెల్లవారకట్ల ఇంటిలోనివారిని ఆమె నిద్రలేపుతుంది.  వాళ్లను ఒక్కొక్కరినే అక్కడు నుంచి విషుకవి వరకు తీసుకువెళుతుంది.  వాళ్లు కళ్లు మూసుకునె ఉంటారు.  అమె వారి చెయ్యిపట్టుకుని వారిని విషుకానివద్దకు తీసుకు వెళ్లుతుంది.  వారిని అక్కడ కూచో పెడుతుంది.  వారు తమ కనురెప్పల మీద బంగారు వస్తువు ఏదో ఒకటి రాచుకుని ఆ మీద రెప్పలు తెరచి చూస్తారు.  అద్ధంలో తమ ప్రతి బింబం చూస్తారు.  తమ ముందు పళ్లు, కాయలు, బియ్యం, వెండివస్తువులు, బంగారు వస్తువులు దర్శనమవుతాయి.  ఇట్లా అందరూ చూడడం అయ్యాక కుటుంబ యజమాని కుటుంబం యొక్క ఆస్తిపాస్తులకు తగ్గట్టుగా ప్రతి ఒక్కరికి రొక్కరూపమైన బహుమానం ఇస్తాడు.
   ఈ కార్యకలాపం యొక్క ఆంతర్యం ఏమిట్ంటే నూతనవత్సరారినాడు తొలిగుండా సరసపదార్ధసంపన్నమైన దృశ్యాన్ని చూడడం. అట్లా చూడడం వల్ల ఆ సంవత్సరం పొడుగునా అతనికి అట్తి అదృష్టమే పడుతూ ఉంటుందని నమ్మకం.
    ప్రతి పండుగకు వలెనే ఈ పండక్కి కూడా విందు భోజనాలు నడుస్తాయి.  బంధువులు స్నేహితులు ఆదరించడంతో వేడుకలతో ఈ రోజుగడుపుతారు. పిన్నలు పెద్దలకు నమస్కరించి వాళ్ల ఆశీర్వచనానాన్ని పొందుతారు.  ఆనాడు ఏ విధమైన పరుషవాక్కులు పలుకరు.