పుట:PandugaluParamardhalu.djvu/77

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

జంతువుల, మనుష్యుల భారానికి భూమి పాతాళానికి కుంగింది. అప్పటి భూదేవిస్థితి బురదలోకూరుకుపోయిన ఆవు స్థితివలె నుండినది.

     భూదేవి తన సంగతి విష్ణువుకు చెప్పుకొన్నది.  ఆప్పుడు విష్ణుమూర్తి భూదేవితో నీవు భయపడకు నిన్ను ఉద్దరిస్తాను అన్నాడు.
    భూమిని తేల్చుట కొరకు అతడు వరాహావతారమును పొందాడు.  నూరు ఆమడల వెడల్పు ఇన్నూరామడల పొడుగు గల పంది రూపం ధరించాడు.  అది నల్లని మబ్బురంగులో ఉంది.  యజ్ఞస్వరూపాని అంది ఉన్నవజదానికి యజ్ఞ వరాహమూర్తి అనే పేరు వచ్చింది.
    ఆ యజ్ఞ వరాహమూర్తి పాతాళలోకానికి వెళ్లి నిజదంష్ట్రాగ్రముచే భూమిని పైకి ఎత్తాడు.  అది స్వస్థానాన్ని చేరింది.  అప్పుడు భూదేవి విష్ణుమూర్తిని పలు విధాల స్తుతించింది.
                          చైత్రబహుళ చతుర్దశి
   ఈనాడు గంగాస్నానం చేస్తే పిశాఛత్వం రాకుండా పోతుంది.  చైత్రబహుళ చతుర్ధశి పర్వం భౌమవారం (మంగళ) తో కూడివస్తే మరీ ఫలప్రదమైనది.
                               చైత్రబహుళ అమావాస్య
                                    కూర్మకల్ప:
     ఈనాడు వహ్నివ్రతము ఆరంభించాలని స్మృతి కౌస్తుభమూ, పితృవ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణి చెబుతున్నాయి.
    అమావాస్య కూడా పర్వదినమేనా అనే నానుడి ఒకటి ఉంది.  కాని చిరకాలంగా అమావాస్య పర్వదినంగానే పరిగణింపబడుతూ ఉంది.
   ఆనాటికి అమావాస్య అనే పేరు ఎందుకు వచ్చిందో తెలిపే కధ ఒకటి ఉంది.  అచ్చోదము అని ఒక కొలను ఉంది.  సోమవులను పితరుల మానసపుత్రిక ఆ కొలనుఇ ఒడ్దున ఉండి తపము చేస్తూ ఉండెను.  ఆమె పేరు అచ్చోద అయ్యెను. ఆమె తన పితరులను చిరకాలము వఱకు చూడకుండా ఉండి పోయింది.  అందుచేత వారిని చూడాలని ఆమెకు మనసుపుట్టేను.  పితరులు ఒకనాడు ఆమెకు దర్సనం ఇచ్చారు. అందులో మావసుడు అనే పితృదేవుడు చాల అందంగా ఉన్నాడు.  పైగా వాడు దివ్యలంకార భూషితుడుగా కూడా ఉండెను.  వీనిని అచ్చోదమోహించింది.