ఈ పుటను అచ్చుదిద్దలేదు
కంచిలో చిత్రగుప్తుడికి ఒక దేవాలయం ఉంది. అచటి మూలవిగ్రహానికి ఒక చేతిలో భూర్జ పత్రాల పుస్తకం, మరిఒక చేతిలో గంటం ఉన్నాయి. ఇది రాతితో మలచ బడింద్. లోహంతో చేయబడ్డ ఉత్సవ విగ్రహానికి కూడా ఒకచేతిలో భూర్జపత్రాల పుస్తకం, మరిఒక చేతిలో గంటంఉన్నాయి.
యముని ప్రధానలేఖకుడు కాబట్టి ఈ పరికరాలు అతనికి సముచితమై ఉన్నాయి.
చిత్రాపూర్ణీమ తమిళ దేశాన ఒక దేవతామూర్తి ఇట్లు ప్రత్యేక పూజలు అందడమేకాక అచటి ఒక సుప్రసిద్ధదేవాలయంలో గొప్ప తిరునాళ్లు కూడా సాగుతాయి.
మధుర-చిత్రపూర్ణీమ
తమిళదేశాన ప్రసిద్ధయాత్రా స్థలాల్లో ఒకటైన మధురలో చిత్రా పూర్ణిమ ఉత్సవం నితాంత వైభవంతో జరుగుతుంది. దీనికి సంబందించిన పురాణగాధ వినతగి ఉంటుంది.
బృహస్పతి దేవతల పురోహితుడు, దేవతలరాజు ఇంద్రుడు ఒకప్పుడు బృహస్పతిని అర్హరీతిని సమ్మనించాడు కాడు. అందుమీద బృహస్పతికి కోపం వచ్చి వెళ్లిపోయాడు. తగిన పురోహితుడు లేక పోవడం చేత ఇంద్రుడు మంచి చెడ్దలు ఏర్పరచలేక అనేక పాపకార్యాలు చేశాడు. ఇంద్రుడు ఇట్లా పాపకార్యాలు చేస్తూ ఉండడం చూస్తే బృహపస్పతికి జాలికలిగించి. శిష్యుని పట్ల వాత్సల్యం కలిగి అతడు తిరిగి వచ్చాడు. శిష్యుని క్షమించాడు. పాపాలు అన్నీ పోగొట్టుకోడానికి భూలోకంలో తీర్ధయాత్రలు చేయవలసిందిగా అదేశించాడు. పలు ప్రదేశాలు తిరిగి ఇంద్రుడు ఒక అడవిలోకి వచ్చాడు. ఆ ప్రదేశం అతి ప్రశాంతంగా ఉంది. అక్కడకు రావడంతోటే ఇంద్రుడికి తన పాపాలు అన్నీ పోయి తాన్ పవిత్రుణ్ణి అయ్యాననే భావం కలిగింది. తనకు ఇట్టి భావం కలగడానికి కారణం ఏమిటని అతడు తన పరిసరాన్నంతటిని బాగా పరిశీలించాడు. సమీపంలో ఉన్న ఒక చెరువు గట్టున ఒక లింగం ఉండడం అతడు కనుగొన్నాడు. తనకు గల హృదయభారం తగ్గి పాపాలనీ పోయాయి. అనే భవన కలగడానికి ఆలింగనం యొక్క ప్రభావమే అని అతడు