పుట:PandugaluParamardhalu.djvu/66

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఛీత్రాదిత్యుడు

        చిత్రగుప్తుడు ఆదిలో 'చిత్రుడు ' అను పేరుగల సూర్యవంశపు రాజు. అతడు సూర్యుని గురించి చిరమాలంతపస్సు చేశాడు.  సూర్యుడు ప్రసన్నుడై ప్రత్యక్షమయ్యాడు.  అప్పుడు చిత్రుడు సూర్యునికి నమస్కరించి తనకు సర్వజ్ఞత్వము, సర్వకార్య ప్రౌడత్వము ప్రసదించమని ప్రార్ధించాడు.  సూర్యుడు అతని కోరిక చెల్లించాడు.  ఆదిత్యుని చేత వరప్రేసాదితుడు కావడం చేత చిత్రుడికి అప్పటి నుంచి చిత్రాదిత్యుడు అనే పేరు వచ్చింది.
                        చిత్రగుప్తుడు
    చిత్రుడు చిత్రాదిత్యుడైన పిమ్మట లవణ సముద్రంలో స్నానానికి వెళ్లాడు.  చిత్రుని వంటి సర్వజ్ఞుడు, సర్వకార్యప్రౌడుడు తనకు లేఖకుడుగా ఉంటే పని ఉసులు  బాటుకు బాగుంటుందని యముదు తలచాడు.  కాగా అప్పుడు యముడు తన భటులను పంపి సముద్ర స్నానం చేస్తూ ఉన్న చిత్రాదిత్యుణ్ణి సశరీరంగా తన వద్దకు  రప్పించుకొన్నాడు.  ప్రపంచంలోని వివిధ ప్రాణులు చేస్తూ ఉండే కార్యాకార్యాలను ఒక పుస్తకంలో వ్రాసి గుప్రంగా జాగ్రత్త చేస్తూ ఉండవలసిందిగా చిత్ర్రాదిత్యునికి యముడు ఆజ్ఞాపించాడు.  ఆ ఉద్యోగంలో కుదిరాక చిత్రాదిత్యుడికి చిత్రగుప్తుడు అనే పేరు వచ్చింది.
                       వింత ఉద్యోగము
      చిత్రగుప్రుని ఈ ఉద్యోగ ధర్మాన్ని గుఱించి శ్రీ జగదీశ్వర అయ్యరు ఇట్లు వ్యాఖ్యానిస్తున్నాడు.
     రికార్డులకి ఎక్కించి మానవుని కంఠస్వరాన్ని అతడు మరణించిన తరువాత కూడ మనము వినకలిగేటట్లునేటి గ్రామఫోనులు చేస్తున్నాయి.  ఈదృష్తితో పరికిస్తే సాధనాంతరం ఉంటే మానవుడి భావాలు, చేతలు కూడా రికార్డు చేయవచ్చునని నిర్ణయించవచ్చు.  నిజానికి ప్రకృతిలో ప్రతివ్యక్తి యొక్క మానసిక భావాలు, శారీరక కర్మలు ఒకానొక కేంద్రష్తానంలో గ్రధితమయ్యే ఏర్పాటు ఏదో ఒకటి ఉండాలి.  జీవామృతలన్నీప్రమాత్మ నుంచి బయలు దేరి వచ్చినవే కదా! ప్రతి జీవుని జననమరణ సమయాల్లో అతని చిట్టాలో పాప పుణ్యాలు ఆవర్ణా అవుతూ ఉంటాయి  ఈ ధర్మాన్ని నెరవేర్చే అతనే యమధర్మరాజు. అతని ముఖ్య లేఖకుదు చిత్రగుప్తుడు.