పుట:PandugaluParamardhalu.djvu/65

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆ నెలలో చక్కని వెన్నెల కాస్తాడు. అ వెన్నెల పౌర్ణమినాడు మరీ ఆప్యాయంగా ఉంటుండి.

   మంచి ఎండ, మంచివెన్నెల గల ఈ పౌర్ణ్మె మానవునికి సుఖాన్ని కలిగించే రోజులలో ఒకటిగా  ఉంది,  జావుననే దీనిని మన పంచాంగకర్తలు 'మహాచైత్రి ' అనే పేద్ద పేరురో పేర్కొంటారు.
     ఈ మహాచైత్రి హిందూ దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఒక్కొక్కరీతి పర్వమై ఉంటొ ఉంది.  చజిత్ర పూర్ణిమ గురువారంతోకాని, శెనివారంతోకాని, ఆదివారతోకాని కలసి వస్తే అది మరీ పుణ్యమై ఉంటుందని పెద్దలు అంటారు.
    చిత్రా పూర్ణిమదినం దక్షసావర్గి మంవంతరాది దినం కూడా - దక్షసావర్గి తొమ్మిదోమనువు.  అతడు దక్షప్రజాపతి పుత్రుడు.  ఈ మన్వంతరాన కుమారస్వామి అద్భుతుండనే పేరుతో ఇంద్రుడు అవుతాడు.  మేధాతిధి, వసువుమున్నగువారు సప్తర్షులు.
    ఈనాడు చిత్ర వస్త్ర దానం, దమన పూజవిహితకృత్యాలుగా ధర్మశాస్త్ర గ్రంధాలు చెబుతున్నాయి.  చిత్ర వస్త్రదవమనగా రంగురంగుల బట్టలను దానం చేయడం.  ఈ పర్వ సందర్భంలో ఇంద్రాది సమస్త దేవతలకు దమన పూజ చేయడం మహాఫలము
                          చిత్ర గుప్త వ్రతం
      చిత్రాపూర్ణిమ దినమున చిత్ర గుప్తరతం చేసిన చ్వారికి యమదండన లేదని శాస్త్ర ప్రమాణం.  అయితే ఆంధ్రదేశంలో కొన్ని ప్రాంతాల్లో చిత్రగుప్తుడినోము ఎప్పుడు పడితే అప్పుడు చేయడం పరిపాటిగా ఉంది.  తమిళదేశాన మాత్రం చిత్రా పూర్ణిమదినమే చిత్రగుప్తుడి పూజకు ఉద్దిష్ఠమై ఉంది.
                            చిత్రుడు 
      చిత్రగుప్తుడు యమధర్మరాజు వద్ద ముఖ్యమైన వ్రాయస కాడు.  మానవుడు తన జీవిత కాలంలో చేసిన తప్పులు చిత్రగుప్తుడు చిఠాకు ఎక్కిస్తాడు.  ఆ చిఠాలోని వ్రాత ప్రకారం యముడు ఆ మానవుని మరణానంతరం అతనిని శిక్షిస్తూ రక్షిస్తూ ఉంటాడు.
    యముని ప్రముఖలేఖకుడగు చిత్రగుప్తుని ఉద్యోగపు భావన చమత్రారమైనది.