Jump to content

పుట:PandugaluParamardhalu.djvu/68

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గుర్తించాడు. తోడనే అతడు దేవశిల్పి అయిన విశ్వకర్మకు కబురుచేసి అక్కడ ఈశ్వరుడికి కూడా ఒక ఆలయాన్ని నిర్మింపచేశాడు.

   ఈశ్వరుణ్ణి, ఈశ్వరిని పూజించాలని అప్పుడు ఇంద్రుడు అనుకున్నాడు.  కాని దగ్గరలో ఎక్కడా పువ్వులు లేకపోయాయి. పువ్వులు ప్రసాదించవలసినదిగా ఈశ్వరుని, ఈశ్వరిని అతడు ప్రార్ధించాడు.  తోడనే ఆ చెఱువులో బంగారు తామరపూవులు అసంఖ్యాకంగా పుట్టుకువచ్చాయి. ఆ పూవులు అందుకుని అతడు దేవపూజ చేశాడు.  ఆనాడు చైత్రపూర్ణిమ. ఆదేవాలయమే మధురదేవాలయుము.
     మధుర దేవాలయములో ప్రధమపూజ ఒకనొక చైత్రపూర్ణిమనాడు జరిగింది.  అందుచేత ఏటేట ఆనాడు అక్కడ పెద్ద ఉత్సవం జరుగుతుంది.  ప్రతిచైత్ర పూర్ణిమ రాత్రికి ఇప్పటికి కూడ ఇంద్రుడు అక్కదికి వచ్చి పూజ చేస్తాడని అచటి ప్రజలనమ్మిక.
                              చిత్రానది
    తమిళదేశంలో తిరునల్వేణి జిల్లాలో చిత్ర అనే ఒకనది ఉంది.  అది తామ్రపర్ణికి ఉపనది.  చిత్రానది కుత్తాళం కొండలలో పుట్టి కుతాలం అనేవూరిలోని దేవాలయానికి సమీపంగా జలపాతముగా పడుతూ ఉంది.  ఈ చిత్రానది ప్రాదుర్భావం చైత్రపూర్ణిమనాడు అని చెబుతారు.  అందుచేత చైత్రపూర్ణీమనాడు చిత్రానదిలో స్నానం చేయడంవల్ల అనేకరకమైన పాపాలు పొతాయని అచటివారు నమ్ముతారు.  ఈనది నీళ్ళు మిక్కిలి ఆరోగ్యకరములని ఇటీవల శాస్త్రీయ పరిశోధనల వల్ల తేలింది.  దాన, దీన కుత్తాలం గొప్పయాత్రాస్ధలమైంది.
                      హనుమజ్జయంతి
    తమిళనాడులో చైత్రపూర్ణిమ ఈ విధమైన పర్ఫమై ఉండగా ఆంధ్ర, మహారాష్ట్రాల్లో ఇది హనుమ జ్జయంతిగా ఉంటూ ఉంది.
    ఆంధ్రులలో మధ్వ మతస్థులకు ఇది మరీ ముఖ్యమైన పండుగగా కనిపిస్తూఉంది.
    హనుమంతుడు అంజనాదేవిని పుత్రుడు.  అయిన కేసరి అను వానరుని భార్య, సంసారంలో విసుగుపుట్టి కేసరి తపస్సు చేసుకోవడానికి వెళ్లాడు.  తపస్సుకు వెళుతూ అతడు తన భార్యను వాయుదేవునికి అప్పగించాడు.  ఆమె శ్రద్ధా భక్రులకు మెచ్చి వాయువు తన గర్భ మందున్న