పుట:PandugaluParamardhalu.djvu/6

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉగాది మన ఉగాదితో జతపరుచుతూ ఉండుటవలన ఒక విషయం ఊహింపనగు చున్నది. ఆర్యులు పార్శీలు కలసి ఉండిన కాలమునకే ఈ పర్వం ఏర్పడి ఉండునని పార్శీలు ఉగాదిని 'నౌరోజ్ ' అంటారు. నౌరోజ్ అనగా కొత్తదినము అని అర్ధము.

   స్థితి ఇట్తిదికాగా ఈ పండుగ ఆర్యావర్తమనబడే ఉత్తర హిందూస్థానములో ఇప్పుడు నామకాత్రమై పోయినది.
   వ్రతోత్సవచంద్రికాకారుని వ్రాతనుపట్టి ప్రస్తుతము వింధ్యపర్వతానికి ఉత్తరాన ఒక్క మాళవదేశంలోనే చైత్రాది పర్వం కొద్దిగా ఉన్నట్లు తేలుతూ ఉంది.  ఈనాదు గృహాలంకరణం, పంచాంగ శ్రవణం, అక్కడ సకృతుగా ఉంది.  ఉత్తర హిందూదేశాన ఇతర ప్రాంతాల్లో ఈమాత్రం కూడా లేదు. ఆర్యావర్తనములో ఈ ఆర్యాచారం ఎందుకు లుప్తమైపోయింది?
    కాలాంతరాన అమలులొనికి వచ్చిన సౌరభార్హ్యస్వత్యమున్వాది కా పరిగణనములో గల తేడాలు ఇందుకు ఒక కారణం కావచ్చు.
       వింధ్యకు దక్షిణమున శాలివాహన శకమున్నూ, ఉత్తరమున విక్రమార్క శకమున్నూ ప్రచారములోనికి రావడము ఇందుకు మఱి ఒక కారణం కావచ్చు.
        ఈ రెండు శకముల సందర్భంలో మహారాష్ట్రంలో ప్రచారంలో ఉన్న గాధ ఇక్కడ వివరింపతగినదిగా ఉంటుంది.
       పురంధరపురంలో ఒక వర్తకుడు అతడు చాలా ధనవంతుడు. అతనికి నలుగురు కొడుకులు. చనిపోయేముందు అతదు తన కొదుకులకు నాలుగు సీళ్లు వేసిన పాత్రలు ఇచ్చాడు.  తాను చనిపోయిన పిమ్మట కాని సీళ్లు తెరవవద్దని అతదు కొడుకులిని ఆదేశించాడు.
      అట్లే ఆనలుగురు కొడుకులు తండ్రిమరణానంతరం ఆ పాత్రల సీళ్లు తొలగించిచూచారు.  మొదటిపాత్రలో మట్టి- రెండవదానిలో బొగ్గులు- మూడవ దానిలో ఎముకలు- నలుగవదానిలో తవుడు ఉన్నాయి.
     దీని అర్ధం వారికి తెలిసిందికాదు.
     ఆనాటి హైందవ చక్రవర్తి విక్రమార్కుడు. ఆ సెట్టి కొడుకులు నలుగురూ దాని అర్ధాన్ని బోధింపవలసిందిగా విక్రమార్కుని కోరారు.  కాని విక్రమార్కునికి దాని అంతరార్ధం అవగాహన కాలేదు.