Jump to content

పుట:PandugaluParamardhalu.djvu/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అప్పుడు వారు ప్రతిష్థానపురానికి వెళ్లారు. అక్కద కూడా రాజుగాని, మరి ఎవ్వరు కాని దాని అంతరర్ధాన్ని తేల్చలేకపోయారు. కాని ఆవూరులోని వింత బాలుడు ఒకడు ఆ సమస్యను విడమర్చి చ్వెప్పాడు.

       ఆ వింత బాలుడు ఒక బ్రాహ్మణ వితంతువు కొడుకు.  ఆ బ్రాహ్మణ స్త్రీ మిక్కిలి చిన్నతనములోనే భర్తను పోగొట్తుకుంది.  ఆమెకు ఇద్దరు సోదరులు, నాగకుమారుడైన తక్షకుని వలన ఆమె గర్భం ధరించించి.  ఇందుకు ఆమె సోదరులు చిన్నయిచ్చుకొని దేశాంతర్గతులై పోయారు.
     దిక్కులేని ఆ దీన వితంతువుకి అప్పుడు ఒక కుమ్మరి వాడు ఆశ్రయమిచ్చాడు,  ఆ కుమ్మరి యింటిలో ఆమె ఒక కుమారుణ్ణి ప్రసవించింది.  కుమారునికి తల్లి శాలివాహనుడు అని పేరు పెట్టింది.  అతడు క్రమంగా పెరిగి పెద్దవాడు అవుతూ వుండెను.
     అట్టివాడు వర్తకుని నాలుగు పాత్రల సమస్యను విని దానిని తాను పరిష్కరిస్తానని రాజు వద్దకు వెళ్లి ఇట్లా చెప్పాడు.  మట్టితోనిండిన పాత్ర వచ్చిన కుమారుడు భూమినీ - బొగ్గులతో నిండిన పాత్రను పొందిన పుత్రుడుకలపనూ, ఎముకలతో నిందిన పాత్రను వడసిన తనయుడు ఏనుగులు, గుర్రాలు, పశువులు మొదలయిన జంతువుల్నీ - తవుడుతో నిండిన పాత్రవచ్చిన సుతుడు ధాన్యాల్ని పంచుకోవాలని వర్తకుని తాత్పర్యమని శాలివాహనుడు చెప్పాడు.
      శాలివాహనుడు ఇంత సముచితంగా ఈ సమస్యను పరిష్కరించిన సంగతి విని విక్రమార్కుటు అతన్ని చూడ్డానికి కుతూహలం పడి కబురు చేశాడు.  విక్రమార్కుని అంతటి వాడు కబురు చేసినా శాలివాహనుడు పోలేదు.  నేను పోయేది లేదని చెప్పివేశాడు.  పైగా విక్రమార్కుడే తన దర్శనానికి వచ్చే రోజు వస్తుందని చెప్పాడు.
     దీనికి విక్రమార్కుడికి కోపం వచ్చింది.  శాలివాహనున్ని మట్టు పెట్టడానికి అపార బలసమేతుడై ఎత్తి వచ్చాడు.  ఇది విని శాలివాహనుడు మట్టితో మనిషి బొమ్మలు చేసి వాటికి ప్రాణం పోసి విక్రమార్కుని సేనల మీదకి పంపాడు.  పొరు ఘోరమై సాగింది.
      శాలివాహనుడు సమ్మొహనాస్త్రం ప్రయోగించి విక్రముని సేనల్ని నిద్రపొయెటట్లు చేశాడు.  అందుకు విక్రముడు వాసుకి అనే నాగరాజును