పుట:PandugaluParamardhalu.djvu/16

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మన పెద్దలు కొన్ని కొన్ని వస్తువుల వాడకానికి కొన్ని కొన్ని తిధులు గడవాలని నియమాలు విధించారు. వినాయక చవితి వెళితే కాని వెలగకాయలు, నాగులచవితి వెళితేకాని తేగలు తినకూడదని మన పెద్దల మాట. అట్లెకొత్త చింతపండు, కొత్త బెల్లము సంవత్సరాది వరకు ముట్టరాదన్నారు. సంవత్సరాదితో ఆయా పదార్ధాలకు పురుడు వెళ్లిపోతుందని , కాగా అప్పటినుంచి వానిని తినవచ్చుననీ వారి అభిప్రాయం. ఇప్పుడు ఇట్టి నియమాలు అంతగా పాటించడంలేదు. ఇప్పుడు సంక్రాంతి నాటికే కొత్త బెల్లం, కొత్త చింతపండూ వస్తున్నాయి. వానిని అప్పటి నుంచే ప్రజలు ఆత్రంతో సేవిస్తూ ఉన్నారు. ఇది ఒకవిధంగా ఆరోగ్యనిమయాలము ఉల్లంఘించడమే. మన పూర్వులు దేహదార్ద్యాదులు ఈనాడు మనకు లేకుండా ఉండడానికి ఇట్టినియమోల్లంఘనం ఒక కారణంగా ఉంటున్నది.

     కొత్త చింతపందు, బెల్లములలో ఉండే దోషాలయొక్క తీక్షత ఉగాదినాటికి తగ్గి అవి అప్పటినుండి భుజింపతగినవై ఉంటాయని మన పెద్దల అభిప్రాయము.
     శాస్త్రంలో వేపపువ్వు, చింతపండు, బెల్లము, నెయ్యి వీనితోనే ఉగాది పచ్చడి చేయాలని స్పస్ఠంగా చెప్పబడి ఉండగా వాదుకలో ఇంకా ఇందులో అనేకమైన వస్తువులు చేరుస్తూ ఉండడం కనిపిస్తూఉంది.
    చాలామంది ఈ గుజ్జులో మామిడి కాయ ముక్కలు చేరుస్తున్నారు.  మామిడి కాయలు శివరాత్రి నాటికి జీడి పెందెలుగా అవుతాయి.  అయితే వానిని సంవత్సరాదికి పూర్వం తినకూడదని మన పెద్దలు నిషేదించి ఉన్నారు.  సంవత్సరాదిలో మామిడి కాయ యొక్క ముక్కలు చేర్చడం చిరకాలంగా ఆచారమై ఉంది.
       వేసవిలో తప్పక సేవించచలసిన ప్రకృతిదత్త పదార్ధాలలో మామిడి కాయలు ప్రముఖమైనవి.  వడదెబ్బకు తట్టుకునే శక్తిని మానవునకు ప్రసాదించే కాయలలో మామిడికాయలు ముఖ్య్హంగా పేర్కొన తగినవవని  ఆయుర్వేద గ్రంధములు చెబుతున్నవి.  కాగా ఉగాదిపచ్చడిలో మొదటిసారిగా మామిడి కాయముక్కలను చేర్చుకొని సేవించి ఆమీదటవసంత గ్రీష్మ ఋతువులలో మామిడికాయలు యధేచ్చగా