పుట:PandugaluParamardhalu.djvu/15

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఈ పర్వంనాడు తివడంలో ఎక్కువ విశిష్టత ఉందని చెప్పలేము. అందుచేత ఉగాదినాడు వేపపువ్వు వాడే ఆంధ్రుల ఆచారమే సంప్రదాయసిద్ధమైందీ. స్తజ్వనీయమైందీ, సర్వోత్తమమైందీ.

     వేప పువ్వు పచ్చిది పచ్చడిలో వేసుకుని ఉగాదినాడు తినడమేకాదు. అది విరివిగా దొరికే ఆ రోజులలో దానిని విశేషంగా సేకరించి ఎండబెట్టి ఉంచుకొని ఏడాది పొడుగునా వేయించుకుని కూరగానో, పచ్చడిగానో చేసుకొనీ - అది వేయించుకొని  చారుకాచుకునీ సేవిస్తూ రక్తశుద్ధిని, రక్తవృద్దిని కలిగించుకోవడం ఆరోగ్యకాములగు ఆంధ్రులు తడవులను బట్టి పాటిస్తూ ఉన్న చక్కని ఆచారం.
    ఏడాది పండుగనాడు ఏమి చేస్తే ఏడాది పొడుగునా అదే చేస్తు ఉంటారనే నానుడి వేపపువ్వు వాడకం విషయంలో మనకు బాగా హత్తింది.
                     ఉగాది పచ్చడి ఉఱువు
    వేపపువ్వు ప్రధాన ద్రవ్యంగా ఉగాదినాడు ఒక విధమైన పచ్చడి చేస్తారు.  దీనికి ఉగాది పచ్చడి అనిపేరు. ఇది ఒక ఔషధయోగమని చెప్పవచ్చును.
    కొత్త చింతపండు తెచ్చి నీటితో పిసికి గింజలు, ఉట్లు, తొక్కలు మొదలగునవి లేకుండా తీసివేసి చిక్కటి గుజ్జు తయారు చేయాలి.  ఆగుజ్జులో కావలసినంత కొత్త బెల్లము వేయాలి. అందులో వేపపూరులను కాడలు, పుల్లలు లేకుండా బాగుచేసి వేయాలి.  అట్లు తయారు చేసిన గుజ్జులో కొద్దిగా నెయ్యి చేర్చి కలియబెట్టిపుచ్చుకోవాలి.  దీనిని పరగడుపున మొదటి జాములోనే పుచ్చుకోవాలి. దీనికి శాస్త్ర ప్రమాణం -

       శ్లో. యద్వర్షాద్ నిలబసుమం
           శర్యరామ్ల ఘ్యతైర్యుతం
           భక్షితం పూర్వయామేశ్యా
           త్తద్వర్షం సౌఖ్యదాయతమ్
    

      ఉగాదినాడు ఆ సంవత్సరపు వేపపువ్వు, చక్కెర, చింతపండు, నెయ్యి కలిపి మొదటి జామునందే తింటె ఆ సంవత్సర మంతా సుఖంగా జరుగుతుందని పై శ్లోక తాత్పర్యము.
     శాస్త్రంలో చక్కెర అని చెప్పబడి ఉన్నా కొత్త బెల్లము వేయడము సంప్రదాయంగా ఉంది.