ఈ పుటను అచ్చుదిద్దలేదు
పవళింపు సేవ చేస్తారు., కీర్తనలు పాడతారు చంద్రభాగానదీ తీరాన ఉన్న పండరిపురంలో ఈనాడు చూడతగిన గొప్పౌత్సవం జరుగుతుంది.
గుంటూరు మండలంలో ఇక తెలుగుచేశపు వ్యవహారంలో ఈ పండుగ జరపబడే తీరు కొంత పరికిద్దాము. గుంటూరు మండలంలో కొన్ని ప్రాంతాలలో దీనిని "పేలాపుపిండి" పందుగ అంటారట. పేలాలు విసిరి పిండిచేసి బెల్లంలో కలుపుకుని తింటారనీ, ఆపేలాల పిండి మీద చల్లుకోవడం కూడా ఆచారమై ఉందనీ ఒకరంటున్నారు. గోదావరి మండలంలో ఉభయ గోదావరి మండలాల్లో మాగాణి గ్రామాల్లో రైతులు ఈనాడు కొత్త పాలేర్లను కురుర్చుకుంటారు. అచ్చటి పాలేళ్లకు తొలిఏకాదశినాదు కాని, దాని ముందు దినాలుఆటవిడుపు దినాలు. తొలిఏకాదశినాడు కాని, దానితరువాత మంచి రోజునగాని కొత్తపాలేర్లకు కొత్త కర్రబట్టలు ఇచ్చి పిలిచి తీసుకువచ్చి పిండివంతలతో భోజనం పెడతారు. నెల్లూరు మండలంలో 'ఏరుముందా ఏకాదశి ముందా! అని నెల్లూరు జిల్లాలో ఒకసామెత ఉంది. ఆ సామెత తొలిఏకాదశికి సంబధించినదని శ్రీ ఒంగోలు వెంకటరంగయ్య ఇట్లు వ్రాస్తున్నారు.' "సామెత ఆషాడ శుద్ధఏకాదశిని గూర్చి పుట్టినది. ఆషాఢము నుంచియే మేఘోదయముగుచుండుటచే యేరువాక పనులు ప్రారంభించువారు ఏటినీళ్లకెదురు చూచుచుందురు. సామాన్మముగా ఆషాఢ శుద్దైకాదశి సరికట్ల పెన్నానదికి కొత్తనీళ్లు వచ్చుటకలదు. అందుచేత ఏరును, ఏకాదశియు పంతములు వేసికొని నేను ముందా! నీవు ముందా! అని త్రోసికొని వచ్చునని అలంకారోక్తి ఈ సామెత యేర్పడినది. ఇప్పటికిని సాధారణముగ ఈ ఏకాదశికి కొంచెము వెనకముందులుగా ప్రవాహము వచ్చుట కలదు. పిప్పల వృక్షం ఈ ఏకాదశినాడు చాతుర్మాస్య్లవ్రతం ఆరంభిస్తారు. చారుతుర్మాస్యవ్రతాచరణక్రమం బ్రహ్మవైవర్త పురాణంలో కలదు. ఆషాఢమాస శుక్లపక్ష ఏకాదశినాడు ఉపవాసము ఉండి చాతుర్మాస్య వ్రతకల్పం