Jump to content

పుట:PandugaluParamardhalu.djvu/156

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ప్రారంభీంచాలని భగవంతుడు యుధిష్థరునకు చెప్పినట్లు అందుకలదు.

  శయనించు పెట్టిన విష్ణుమూర్తికి పూజ చాతుర్మాస్య వ్రతం మొదలుకొని ఏకాదశి, ద్వాదశి, అమావాస్య అష్టమి, కర్కాటక సంక్రాంతి మున్నగు పర్వాలనాడు ఉపవాసాలు ఉంటూ కర్తీక శుక్ల ద్వాదశికి ఆవ్రతం పూర్తి చేయాలి.
     చాతుర్మాస్యవ్రతంలో పిప్పల వృక్షానికి ప్రదక్షిణం ప్రధానం, దేవాలయాల్లో దీపారాధన.
    చాతుర్మాస్యవ్రతంలో సరస్వతీపూజ కూడ ఉంది.  సంవత్సరంతో వచ్చే ఇరవైనాలుగు ఏకాదశులు ఉపవాసం ఉండలేకపోయినా చాతుర్మాస్యాల్లో వచ్చ్

ఏ ఎనిమిది ఏకాదశులైనా ఉండడం మంచిది. ఈ ఎనిమిది ఏకాదశులలో వంకాయ, కరుబూజ, రేగి మున్నగునవి తినకూడదని వ్రతోత్సవ చంద్రికాకారుడు అంటున్నాడు.

                     ఆషాఢశుక్ల ద్వాదశి
    ఆషాడ శుక్ల ద్వాదశి చతుర్మాస్య వ్రతారంభదినమనీ స్మృతికౌస్తుభము చెబుతూవుంది.
    ఆనాడు ఈ వ్రతం ప్రారంభించడానికి వీలులేనివారు ఆషాడశుద్ధ పూర్ణీమనాడు కానీ, కర్కాటక సంక్రాంతినాడుకాని చేయవచ్చు.
    ఏనాడు ప్ర్రారంభించినా ఈ వ్రతం సమాప్తి కార్తీకశుద్ధ ద్వాదశినాడే.
                       యతులకు
     ఇది యతులకు ముఖ్యమైన వ్రతం. వ్రతంచేసే యతులకు ఆశ్రయం ఈయవలసిన బాధ్యత గృహస్థులు వహించాలి.
     గృహస్థులున్నూ ఈ వ్రతాన్ని ఆచరించవచ్చును.
     యతులు మున్ముందుగా వ్యాస మహర్షి పూజచేయాలి. ఆమీద ముండనం చేయించుకోవాలి.  మళ్ళీ వ్రతసమాప్తి అయ్యేవరకు క్షురకర్మ చేయించుకోకూడదు. 
     చాతుర్మాస్వవ్రతం చేసేవారు వ్రతపూర్తి అయ్యేవరకు నిమ్మపళ్ళు, అలసందెలు, ముల్లంగి, గుమ్మడికాయ, చెరుకుగడలు - వీనిని వర్జింజాలని శాస్త్రవచనం.
    వీనిని బొత్తిగా అరిహరించి మొదటినెలలో కూరలు మాత్రయున్నూ, రెండవ నెలలో పెరుగున్నూ, మూడవ నెలలో పాలున్నూ, నాల్గవ నెలలో ద్విదళ (రెండాకులుండే) పత్రశాకములున్నూ అన్నాధరువులుగా ఉపయో