పుట:PandugaluParamardhalu.djvu/154

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

చాతుర్మాస్యదీక్షాదినాల ఏకాదశుల్లో మొదటిదికావడం చేత దీనికి ప్రధమైకాదశి అని పేరు వచ్చింది.

           దీనికి ఈ పేరు రావడానికి మరి ఒక కారణం కూడా ఉండి ఉండవచ్చు.
           ఉత్తరాయణంలోకంటే దక్షిణాయణంలో పండుగలు, పబ్బాలు ఎక్కువ, దక్షిణాయనంలో ఆరోగ్య పరిరక్షణార్ధం నియమాలు ఎక్కువగా పాటించవలసి ఉండడంచేత నియమ పాలనార్ధం ఈ కాలంలో మనపెద్దలు వ్రతాలు ఉత్సవాలు ఎక్కువగా పెట్టారు.  అట్టి పండుగలకు, పబ్బాలకు బోణీవంటిది ఈ ఏకాదశి.
        ఇప్పటినుంచి ఒకదాని తరువాత ఒకటిగా వచ్చిపడే పండుగలకు, పబ్బాలక్జు ఇది తొలి కాబట్టి దీనికి తొలిఏకాదశి అని పేరు వచ్చి వుంటుందని అనుకోవచ్చు.
      తొలి ఎకాదశి పందుకను గురించి బ్రహ్మ విఅవర్తపురాణంలో వివరింపబడి వుంది.
     ప్రాయకంగా ఇది విష్ఠాపరులకు ఉపవాసదినం. చాతుర్యాస్య వ్రతానికి ప్రారంభవినం.  ఈనాటినుంచి నాలుగుమాసాలపాటు ప్రతిదినము పూరాణగ్రంధాలు పఠిస్తారు.

    విష్ణువుకి ప్రియమైంది
    అన్నిఏకాదశుల్లోకి ఇది విష్ణువుకు బాగా ప్రియమైంది.
    విష్ణుసంబంధంగా ఈ పర్వానికి రెండు పౌరాణిక గాధలు ఉన్నాయి.

    ఒకటి: ఈరోజు మొదలు విష్ణుమూర్తి నాలుగు నెలలు పాతాళలోకంలో బలిచక్రవర్తి ద్వారం వద్ద ఉంది కార్తీకశుద్ధ ఏకాదశికి వెనక్కి తిరిగి వస్తాడని చెప్తారు.
      రెండు: ఈ దినం మొదలు విష్ణుమూర్తి నాలుగు నెలలపాటు క్షీరసముద్రంలో శేషశాయియై పండుకొని కార్తీకశుద్ధ ఏకాదశికి మేలుకొంటాడని పురాణాలు చెప్తున్నాయి.
       ఈ రెండవ గాధను పురస్కరించుకుని ఈ పండుగకు దేవశయని అనే పేరు పురాణాలు పేర్కొంటున్నాయి.  గదాధరపద్దతి దీనిని హరిశయనం అంటున్నది.  ఈ సందర్భంలోనే దీనికి శయనైకాదశి అనే పేరు వచ్చింది.
    విష్ణ్యాలయాల్లో ఈనాటిరాత్రి విష్ణుశయనవ్రతాలు చేస్తారు.  విష్ణువిగ్రహాన్ని ఆభరణాదులతో అలంకరించి జాజిపువ్వులచేత పూజిస్తారు.