పుట:PandugaluParamardhalu.djvu/153

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఉచిత వయస్సు రాగా ఆనందునికి ఉపనయనం చేశారు. ఆ సంధర్భంలో గురువు అతనిని తల్లికి దండం పెట్టమంటాడు.

   అప్పుడు ఆ బాలకుడు గురువుతో ఇట్లా అన్నాడు.  గురువర్యా! నేను ఏ తల్లికి నమస్కారం చేయాలి! నన్ను కన్నతల్లి ఒకతె, పెంచినతల్లి మఱిఒకతె.  అందుమీద గురువు ఆశ్చర్యపడి హైమిని నీతల్లి కాదాఅని అడిగాడు.  అప్పుడు శిష్యుడు 'అయ్యా! ఈమె విశాల గ్రామమందు ఉన్న చైత్రునకు తల్లి, ఈమనాకు తల్లి కాదు.  జాతహారిణి అనే మార్ఝారం అతికమకలకు అన్నిటికీ కారణం. ఇప్పుడు నేను ఎవరికి నమస్కరించాలి! అన్నాడు.
     గురువు ఈ ధర్మసంకటాన్ని తీర్చలేకపోయాడు.  చైత్రుని రావించు కోవలసిందిగా విక్రాంతికి చెప్పి ఆనందుడు బ్రహ్మను గురించి తపము చేయడానికి వెళ్లిపోయాదూ.  కొంతకాలము తపము చేయగా బ్రహ్మప్రత్యక్షమయ్యాడు.  ఆనందుడు అతనిని ముక్తిని అర్ధించాడు.
    అప్పుడు బ్రహ్మ ఇట్లా చెప్పాడు 'నీవు మనువు కావలసి ఉంది.  జన్మాంతర కృతమైన తపమువలన నీవు ఆరవ మనువు కావలసి ఉంది.  మన్వాధికారాన్ని నిర్వర్తించిన తరువార నీకు ముక్తి కలుగుతుంది. కాబట్టి నీవు ఇప్పుడు తపంమానివేయి.  పూర్వజన్మలో నీవు, వాచక్ధుస్సు వలన పుట్టావు. కాబట్టి ఇప్పుడు నీవు చాక్దుషమనువు అనే నామంతో వెలయగలవు ' అన్నాడు.
  అందుమీద చాక్డషుడు తపం కట్టిపెట్టి ఉగ్రుడనేరాజు కూరుతు అయిన విదర్బను వివాహమాడాడు.
    అతని మన్వంతరమున మనోజవుడు అనేవాడు ఇంద్రుడు, సుమేధ, అతి నామ మున్నగువారు సప్తర్షులు.
                       ఆషాఢ శుక్ల ఏకాదశి
    ఆషాడ శుక్ల ఏకాదశి 'మహాఏకాదశి ' అని పేరని వ్రతోత్సవ చంద్రిక అంటున్నది.  గ్రంధాంతరాల్లో ప్రధమైకాదశి అనే  నామం కనిపిస్తున్నది.
   ఏడాడి ఇరివైనాలుగు, అధికమాసం వచ్చినప్పుడు ఇరవై ఆరు ఏకాదశులు ఉంటుండగా ఈ ఒక్క ఏకాదశిని మహాఏకాదశి అనీ, ప్రధమైనకాదశి అని గొప్పగా చెప్పడానికి కారణం అరయ తగింది.
                       తొలి ఏకాదశి
   ప్రధమైకాదశి అనుసంస్కృత నామాన్నిపట్టి తెలుగువారు దీనిని తొలిఏకాదశి అని వ్యవహరిస్తున్నారు.