ఈ పుటను అచ్చుదిద్దలేదు
రామకృష్ణశాస్త్రిగారు చెప్పిన ఈ విషయాన్ని పట్టి జగన్నాధస్వామి విషయంలో ఆంధ్రప్రాంతంలో పాదుకొని ఉన్న గాధ అశుచిప్రాపకమైన పుక్కిటి గాధ అని నిశ్చయమవుతూంది.
జగన్నాధము పురుష్జోత్తమక్షేత్రము. దీనికి సంబందించిన ఒక కధ ఉంది. జగన్నాధుడైన కృష్ణుడు నిర్యాణం చెందగా అతని దేహాన్ని దహనం చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో సముద్రం పొంగి ద్వారకా నగరాన్ని ముంచి వేసింది. సంపూర్ణంగా దుగ్డంకాని జగన్నాధుని దేహం సముద్రమ్లో కొట్టుకొని పోవడాం ఆరంభించింది. దానిని కొందరు భక్తులు పట్టుకుని దారువు నందు సంపుటం చేసి ఓడ్రదేశంలోని పూరీలో స్థాపించారు. అందుచేత ఇది జగన్నాధక్షేత్రం అయింది. ఆషాడశుక్ల పక్షపు విదియ - జగన్నాధస్వామి వారి రధోత్సవానికి ప్రసిద్ది. ఆషాఢశుద్ధ పంచమి "ఆషాఢశుద్ద పంచమ్యాం వచ్చెనె వృద్ధ గౌతమీ అధవా తప్పి దారేణ ద్వాదశ్యాది తప్పదు." అని గోదావరి తీరవాసుల్లో ఒక చాటుక్తి కలదు. ఆషాఢశుద్ద పంచమిని తప్పితే ద్రాదశిని గౌతమునికి వరేదనీరు వస్తుందని పై చాటూక్తి భావం. 'ఆడిపదినెట్టు ' అని కావేరీతీరవాసులు ఒక పండుగ చేస్తారు. ఆడిపదినెట్టు అనగా ఆడామానం పెద్దెనిమితో రోజు అని అర్ధం. ప్రాయికంగా ఆ నాటికి కావేరీకి కొత్త నీళ్ళు వస్తాయి. వ్యవసాయపు పనులకు తరుణం అవుతుంది. ఆడి మాసం ఇంచుమించు మన ఆషాఢమాసం. ఆషాఢశుద్ధ షష్టి స్కందవ్రతము - స్మృతికౌస్తుభం ఈ వ్రతములో సుబ్రహ్మణ్యేశ్వరుని షోడషచారాల చేత పూజించాలి. ఉపవాసం ఉండాలి. జలమును మాత్రం పుచ్చుకోవచ్చు. మరునాడు కుమారస్వామిని దర్శించాలి. శరీరారోగ్యం కలుగుతుంది. ఆషాఢశుద్ద సప్తమి వివస్వత్సప్తమీ పురుషార్ధ చింతామణి వివస్వన్నామో భాస్కరష్యోత్పతి: తత్పూజనంచ. విత్రాఖ్య భాస్కర పూజా అని నీల మత పురాణము. ద్వాదజ