పుట:PandugaluParamardhalu.djvu/152

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సప్తమీ వ్రతము చతుర్వర్గ చింతామణి.

                          ఆషాఢశుద్ధ అష్టమి

       మహిషఘ్నీపూజా, స్మృతికౌస్తుభం
       దుర్గాస్టమీ, పరశురామియాష్టమీ, గదాదరపద్దతి
       మహిషాసురమర్ధనీపూజ
                               ఆషాఢశుద్ధ నవమి
       ఐందీ దుర్గా పూజా స్మృతి కౌస్తుభం
       ఇంద్రాదేవి పూజ
                               ఆస్జాఢశుద్ద దశమి
      జగన్నాధస్య పునర్యాత్రా మాన్యాది: చాక్షుసమన్యాదిం
      శాకవ్రత మహాలక్ష్మీ వ్రతారంభం దధి వ్రతారంభం
      

      ఈనాడు మహాలక్ష్మీ పూజ చేసి ఒక నెల ఆకుకూరలు తినుటమాని ఆకుకూరలు దానం చేయాలి.
     ఆషాఢశుద్ద దశమి చాక్షుపమంవజ్ంతరాది దినము.  చాక్షుషమనువు మనువుల్లో ఆరోవాడు.  అతని వివరాలు వినదగ్గవి.
    అనమిత్రుడని ఒక రాజు. అతని భార్య గిరి భద్ర వారికి సర్ఫలక్షణ లక్షితుడైన ఒకకొడుకు పుట్టాడు.  పురిటిలో గిరిభద్ర కుమారుని మక్కువతో అక్కున చేర్చుకుని ముద్దు పెట్టుకుంది.  ఆ శిశువు ఫక్కున నవ్వాడు.  ఆ వింత నవ్వుకు కారణం ఏమిటని ఆమె బిడ్దని అడిగింది.  అప్పుడు ఆ కుఱ్ఱాడు ఇట్లా చెప్పాడు.  సన్ను మింగడానికి జాతహరిణి అనే మార్జారం పొంచి ఉంది.  అది తెలిసి కొనక నన్ను పుత్ర ప్రేమ చేత ముద్దు పెట్తు కుంటున్నావు.  నీకు నాకు పరిచయం ఐదారు దినాలది.  ఇంతలో ఇంత వ్యామోహాంతో ఉన్నావు.
    కుఱ్ఱాడు ఇట్లా చప్పగా గిరిబద్ర కోపగించుకొని నేను చేసే పని నీకు నచ్చక పోతే పురిటింటిలో నుంచి వెళ్లిపోతాను అంటూ వెళ్లిపోయింది.  ఆమె వెళ్లి పోవడంతోటే జాతహరిణి వచ్చి ఆ బాలుని తీసుకుని విక్రాంతుడనే రాజు యొక్క భార్య హైమిని ప్రసవించి ఉన్న శయ్యయందుంచి అచటి బిడ్దను మఱి ఒక యింటికి కొనిపోయి అక్కడ పెట్టి ఆ యింటిలో పుట్టిన శిసువును తినేసింది.
   అంత అక్కడ విక్రాంతుడు తన కొడుకు పుట్టిన విషయం తెలుసుకుని చలా ఆనందించి అతనికి ఆనందు అనే పేరు పెట్టాడు.