Jump to content

పుట:PandugaluParamardhalu.djvu/150

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సంస్కృతభాషలో అడిగాను. ఆంధ్రప్రాంతంలో వాడుకలో ఉన్న శ్లోకాన్ని ఆశ్లోకానికి ఉపపత్తి కలిగిస్తూ మనవారు చెప్పేగాధనీ ఆయనకు చెప్పాను. అందుమీద ఆయన నేను చదివిన శ్లోకపాఠం అపపాఠమనీ, తమ ఓఢ్రదేశంలో ఆశ్లోకం ఆ మాదిరిగా లేదనీ చెబుతూ సరియైన శ్లోకపాఠం ఇట్లా చదివారు:

     నీలాచల నివాసాయ
     నిత్యాయ పరమాత్మనే
     సుభద్రా బలభద్రాభ్యాం
     జగన్నాధాయ మంగళం

     దేవాలయ మందలి పురోహిత మంటపంలోని వృద్ధపండితులు కూడా మా ఉభయుల ఎదుట 'సుభద్రా బలభద్రామ్! జగన్నాధాయ మంగళం ' అనే పాఠంతోనే సదరు శ్లోకాన్ని చదివారు.  చదివి మధుసూదన మిశ్రునితోబాటు వారున్నూ సుభద్ర శ్రికృష్ణుని భార్యకాదన్నారు.  సుభద్రతోనూ, బలభదునితోనూ కూడిఉన్న జగన్నాధ స్వామిక్జీ మంగళమనే ఆశ్లోకచరణ తాత్పర్యమన్నారు.  ఐతే ఈ సుభద్రే ఎవరని నేను మధుసూదన మిశ్రుని అడిగాను.  ఆయన ఇట్లా చెప్పారు.  ఈశ్లోకంలో ప్రస్తావితమైన సుభద్ర మీపుక్కిటి గాధల్లోని సుభద్ర కాదు.  శ్రీకృష్ణుని అష్టమహిషిల్లోని సుభద్రకూడా కాదు. దేవకీ గర్భమున పెరుగుతూ ఉండిన బలరాముణ్ణి రోహిణి గర్భములోకి మార్చిన దిన్నీ: తాను యశోద గర్భమున స్త్రీ శిశువుగా జన్మించి తనను దేవకివద్దనుకును, దేవకీ అష్టమగ్తర్బంలో పుట్టిన శ్రీకృష్ణుని యసోదవద్దకున్నూ మార్చుటకు అవకాశము కల్పించినదిన్నీ, కంసుని చేతపైకి ఎగురవేయబడినదిన్నీ, భద్ర, సుభద్ర, భద్రకాళి మొదలైన పన్నెండు నామాలతో ప్రఖ్యాతమైనదిన్నీ అయిన యోగమాయాదేవి ఈ సుభద్ర.  ఈ విషయమంతా స్థల పురాణంలో ఉందా.  సోదరి సోదర సహితుడై స్వామి ఊరేగుతూ ఇంద్రద్యుమ్నానికి వెళ్లి వస్తాడు.  జగన్నాధస్వామి దేవేరి లక్ష్మి ఈ ఊరేగింపుతో ఇంద్రధ్యుమ్నానికి వెళ్లద్.  దేవి ఆలయం ప్రాకారంలో విడిగా గర్భగుడికి కొంచెం వెనుకగా ఎడమవేపున ఉంది.  తమరు వెళ్ళి చూడండి స్వామి, సుభద్ర, బలభద్రుడు ఇంద్రద్యుమ్నానికి పోయివచ్చిన తరువాత దేవి వెంటనే తలుపు తియ్యదు.  మూడురోజుల తరువాత తీస్తుంది.  మూడురోజులూ స్వామి సోదర సోదరీ సహితుడై బయటనే ఉండిపోతాడు. ఇవి అన్నీ దాఖలాగా మీరు చూస్తారుగా ' అన్నాడా పండితుడు.