పుట:PandugaluParamardhalu.djvu/149

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

హిందూదేశచరిత్రలో మహమ్మదీయుల మొదటిదాడికి ఎదురొడ్డినిలిచిన దాహిరురాజు చెల్లిల్ని పెళ్లిచేసుకున్న అనాచారి అని చదివినప్పుడూ, పృధ్వీరాజు రాణీ సంహుక్తను హిందూధర్మశాస్త్రవిరుద్దమైన వివాహం చేసుకున్నప్పు మ్లేచ్చ సాంప్రదాయపు దంపతులనీ చదివినప్పుడు ఒక విధమైన జుగుప్సపుట్టుకు వస్తుంది.

    దాహిరాజు, పృద్వీరాజు చేశిన అశుచిప్రాపక కార్యానికి శ్రీకృష్ణుడు ఒజ్జబంతి ఐనాడా!
   ఈ సందేహం నన్ను చిరకాలంగా వేధిస్తూనే ఉంది.  సందర్బమైనప్పుడల్లా పండితులతో ఈనాసందేహం సంగరి చెబుతూనే వచ్చాను.
    నాడుపూరీ జగన్నాధస్వామి రధోత్సవం ముగిసే ఆషాడ శుద్ధపూర్ణీమ శ్రీకంఢంపాటి రామకృష్ణ శాస్త్రిగారనే ఒక పండిత ప్రకాండునితో సంభాషణవశాన్ని 'సుభద్రా ప్రాణన్నాధాయ! జగన్నాధాయ!' అనే శ్లోకం సంగతి ఎత్తాను.  ఈ సందర్బంలో అయన చెప్పినసంగతులు ఆంధ్రదేశంలోని పూరీజగన్నాధ భక్తులు అందరూ తెలిసికో తగ్గవిగా ఉన్నాయి.
    "రౌత్రి సవంత్సరంలో ఆషాఢమాసంలో నేను పూరిజగన్నాధం పోయి ఉన్నాను.  రధయాత్ర జరుగుతూ ఉంది. స్వామి జగన్నాధం నుంచి ఇంద్రద్యుమ్నానికి వెళుతున్నాడు.  అక్కడ మూడురోజులు ఉండి శుద్ధ ఏకాదశినాటికి తిరిగి జగన్నాధం చేరుతాడు.  ఆలయందగ్గరనుంచి ఒక దాని ప్రక్కను ఒక రధంగా మూడురధాలు బయలుదేరుతాయి.  మొడటి రధంలో జగన్నాధస్వామి వేంచేసి ఉన్నారు.  దానికి కుడితట్టున ఉన్న రధంమీద సుభద్రాదేవి ఉంది.  దేవి రధానికి కుడితట్టున్న ఉన్న రధం మీద బలబద్రుడు ఉన్నాదు.  ఇప్పుడు మీరు అనుకుంటూ ఉన్నట్లే అప్పుడు నేను కూడా సుభద్ర జగన్నాధస్వామి యొక్క దేవేరి అనే అనుకునేవాడిని.  నాఅభిప్రాయానికి కిన్నీ పైశ్లోకమే కారణం.  రధాల స్థితినిబట్టి నాకు అప్పుడు ఒక సందేహం వచ్చింది.  భార్య రధం స్వామిరధానికి  ఎడమప్రక్కను పెట్టక కుడిప్రక్కను ఉంచారేమా అని! జగన్నాధానికి సమీపమందుండే వీరభధ్రబలపురం కాపురస్తులూ, తార్కికపండితులూ, అప్పుడు అక్కడికి వచ్చి ఉన్నవారూ ఐన మధుసూదన మిశ్రుడనే ఆయన్ని ఈ విషయమై