పుట:PandugaluParamardhalu.djvu/148

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆషాఢము

    ఇది సంవత్సరంలో నాలుగో మాసం
    ఆషాఢమాసంలో గృహనిర్మాణానికి ఆరంభించిన భృత్య రత్న పశుప్రాప్తి అని మత్స్యపురాణము.
    ఆషాఢమాసంలో ఒకసారైనా గోరింటాకు పెట్టుకోవాలంటారు.
    ములగ కూర బాగా తినాలి అంటారు.
    ఆనపప్పు వాడాలంటారు.,
                            ఆషాఢ శుద్ధ విదియ
  రధయాత్రో మనోరధ ద్వితీయా జగన్నాధస్వామి రధయాత్ర.
  ఈనాటి వివరణలో మన పంచాంగకర్త 'జగన్నాధక్షేత్రేరధోత్సవ:'
  అని వ్రాస్తారు.
  భక్తి పరులైన తెలుగు పెద్దలు పూరీజగన్నాధస్వామిని గురించి

    .నీలాచల నివాసాయ
    నిత్యయ పరమాత్మనే
   సుభద్రా ప్రాణనాధాయ
   జగన్నాధాయ మంగళం,'

  అనే శ్లోకం తరుచు చదువుతూ ఉంటారు.
  జగన్నాధుడు శ్రీకృష్ణుని అపరావతారంకదా! పైశ్లోకాన్ని పట్టి శ్రీకృష్ణుని అష్ట భార్యల్లోనూ ఒకతెయైన భద్రాదేవి ఈ అవతారంలో సుభద్రనామంతో జగన్నాధస్వామి భార్యాఐనట్లు స్పురిస్తుంది.
  ఈస్పూరణ ఇట్లా ఉండగా శ్రీ చెళ్లపిళ్ళ వెంకటశాస్త్రిగారు ఈ సందర్బంలో వేరొక సంగతి వెల్లడించారు.
  అర్జునిడికి చేపట్టిన శ్రీకృష్ణసోదరి సుభద్ర ఉన్నదికదా! ఆసుభద్ర ఒకసారి శ్రీకృష్నుని నీకుఏమి కావాలో కోరుకోమన్నాడట.  అప్పుడు ఆమె తనకు శ్రీకృష్ణుడు వంటి భర్త కావాలన్నదట.  అందుమీద శ్రికృష్ణుడు సుభద్రతో అవతారాంతర మందు నీకోరిక చెల్లుతుందన్నాడట.  జగన్నాధస్వామిగా పూరీ లో అవతరించినప్పుడు శ్రీకృష్ణుడు సుభద్రను భార్యగా స్వీకరించాడట అందుచేతనే  'సుభద్రాప్రాణనాధాయ! జగన్నాధాయ ' అనే ప్రయోగం పుట్టిందిట.
   ఇత్యాదిగా శ్రీ వెంకటశాస్త్రిగారు వ్రాసి ఉన్నారు.  ఈ విషయమై మరి ఇద్దరు ముగ్గురు పండితులను కూడా అడికి ఉన్నాను.  వారున్నూ ఇట్లే చెప్పిఉన్నారు.