పుట:PandugaluParamardhalu.djvu/138

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఏళ్ళునదులుపొంగ వెంబడేవచ్చాయి.
ఆకాశమునమబ్బు లవతరించాయి.
మబ్బులో ఒక మెరుపు మాయమైపోయింది.
ఉరు మొక్కటావేళ ఉర్మిపోయింది.
కాపుపిల్లలు మనసు కదిలిపోయింది.
అటకమీద గంప అందుకోవయ్య
విత్తనాలుతీసి విరజిమ్మవయ్య
మృగశిరకార్తిలో ముంచెత్తువాన
కలుపరా అబ్బాయి కొత్తదూదల్ని
కట్టరా అబ్బాయి కొత్తనాగళ్లు
దున్నరా ఓ అయ్య దుక్కుల్లుమీరు
ఒకగింజ కోటియై వర్ధిల్లుమీకు
ఏరువాకొచ్చింది ఏరువాకమ్మ
ఏరునదులు పొంగి వెంబడేవచ్చాయి.
కొత్తల్లుడొస్తాడు కోడలొస్తుంది.
కొత్తబట్టలు తెచ్చి దాచండిమీరు
పళ్లుపూవులు తెచ్చి పంచి పెట్టాలి
కొత్తబట్తలుకట్తి కొత్తనాగళ్ళతో
కొత్తదూడలతో కొత్తపాలేర్లటొ
ఏరువాకాసాగి మురుసుకోవాలి
కొత్తపంటలు మనము కోరుకోవాలి.
ఏరువావాకొస్తుంది ఏరువాకమ్మ
ఏళ్లునదులూపొంగి వెంబడేరావాలి
ఏరువాకమ్మకి ఏమి కావాలి
ఎర్ర ఎర్రనిపూవూల మాలకావాలి.
ఎరుపు తెలుపుల మబ్బు టెండకావాలి
ఏరువాకమ్మకీ ఏమి మొక్కాలి.
పొలముగట్టున నిలిచి వేడుకోవాలి
టెంకాయవడపప్పుతెచ్చిపెట్టాలి
ముత్తైదులందరూ పాటపాడాలి
పాటబాడుతుతల్లి పాదాలుమొక్కాలి