Jump to content

పుట:PandugaluParamardhalu.djvu/137

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

హలాకాధికరణములో నిట్లు ఆ పండుగ సూచనగా నున్నది.

సరా: ఉదృషభయ్లజ్ఞాదయ ఉబిచ్చెణి
       జ్యేష్ఠమాసస్య పౌర్ణిమాస్యాంబలీవర్ణాన్
       ఆభ్యర్చ్యధాపయంతిసోయుం ఉద్యషభయజ్ఞ:

         "ఔత్తరాహులు ఉద్ప్యషభయజ్ఞము చేయుదురు.  ఇది జ్యేష్ఠ్గమాస పూర్ణీమనాదు చెయబడును."
       ఇట్లుజైమిని కాలము నాటికే యీ పండుక సుప్రసిద్ధమై యుండెను.  
       ఈ పందుగను గుఱించి శ్రీ పెండ్యాల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి ఇట్లు వ్రాస్తున్నారు.
      "ఉద్బ్యషభోత్సవమును గూర్చి 'అనడుత్సవము ' అను పేరుతో అధర్వవేదమున గలగు.  దాని విధి నిషేధికము శ్రౌతసూత్రమున గలదు.  ఇది తొలుత హలకర్మము, అంకురారోపణము అను బ్రాఅహ్మణుల కర్మములకు సంబంచించియే యున్నది.  లేకుండిన పరాశర బొదాయనాది గృహ్యసూత్రముల కిది యెక్కదు.  వ్యవసాయము బ్రాహ్మణుడు చేయుటమానిన పిమ్మటనది అమంత్రకముగా బ్రాహ్మేణేతరుల పాలబడెను.
     వ్రతగ్రంధములందంతగా కానరాక పోయినను  సేద్యగాండ్రు మాత్రము తడవులను బట్టి ఈ పండుగను జరుపుతూనే ఉన్నారు.  ఈ పండుక సంబంధమైన పాటలు కొన్ని సేకరించి శ్రీరావూరు  'కృష్ణాపత్రికలో (యువసంవత్సరం) ప్రచురించారు. ఉందుంది ఏరువాక పాట, నాగలిపాట అను రెండుపాటలు ఇక్కడ ఉదాహృతాలు అవుతున్నాయి.

   ఏరువాకొచ్చింది ఏరువాకమ్మ
   ఏళ్ళునదులుపొంది వెంబడేవచ్చాయి
   నల్లమేఘాలలో నాట్యమాడింది.
   కొండగుట్టల మీద కులుకులాడింది.
   ఇసుకనదిలో దూరి బుసలుకొట్టించి.
   పాడుతూ కోయిలా పరువులెత్తింది.
   ఆడుతూ నెమలి అలసిపోయింది.
   నవ్వుతూ మా అయ్య బువ్వతిన్నాడు.
   ఏరువాకొచ్చింది ఏరువాకమ్మ