పుట:PandugaluParamardhalu.djvu/136

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

దీనిని తెలుగునాట ఏరువాక పున్నమి అని వ్యహరిస్తున్నారు.

            ఏరువాక అనగా ఏమి? ఆ పండుగ ఎట్టిది? ఈ సందర్బమున శ్రీసురవరము ప్రతాపరెడ్ది ఇట్లు వ్రాస్త్రున్నారు.
        "ఏరువాకయను పదమునకు ఆంధ్రదీపికా నిఘంటుకారుడిట్ల వ్రాసియున్నాడు.
      ఏరు=సర్వావయవములు కలనాగటికి యెడ్లనువూనినది. సర్వావయములు గల నాగలి.  ఏరువాక- దున్నుటకారంభము.
     శబ్దరత్నాకరనిఘంటు కారులును నిట్లుసెలవిచ్చియున్నారు. ఏరు=ఎద్దులను గట్టి దున్నుటకు సిద్ధపరచిన నాగలి.
     ఏరువాక=దుక్కి యొక్క ప్రారంభము.
     ఈ రెండర్ధములను విచారించి చూచినది వ్యవసాయకులకు సంబంధించినది అని విశదమయ్యెడిని ఈ పండుగ వర్షర్తువు యొక్క యారంభదశలో జేయబడును.  అప్పుడువర్షములు గురిసి భూమి పదునైన యెడల (పునర్వసు కార్తిలో) పునాసవిత్తనములు వేయుదురు. పునర్వసు నుండియే పునాసపద మేర్పడినది.) ఈ పండుగనాడేద్దులకు మైకడిగి కొమ్ములకు రంగులు పూసి గజ్జెలు, గంటలు, అద్దము, కుచ్చులు మెడనుగట్టి యలంకరింతురు.  ప్రొద్దుననే యింటిలో  పొంగలి(పులగము) చేసి యెద్దులకు బెట్టుదురు.  ఎద్దులనుగట్టివేయు గాడికి ధూపదీప నైవేద్యములిత్తురు.  సాయంకాలమునందుతప్పట, మేళము, మున్నగు మంగళవాద్యములతో నూరిపనుల నన్నిటిని నూరిబయటకు దోలుకొనిపొవుదురు. ఊరివాకిటికొక పుంటినారతోజేసిన తోరణము కట్టుదురు.  ఈతోరణమును గ్రామమజనులు చేఱుకోలలతో గొట్టి పీచుపీచుచేసి యెవ్వరికిదొఱకిన పీచువారు తీసుకొనిపోయి యింటబెట్తుకొందురు.  ఇదిపనులకు మేలుకలిగించునని వారి విశ్వాసము.
   కర్షకులకు ఎద్దులే జీవిత సర్వస్వము.  కావున వాని పూజ కృతజ్ఞతాసూచకము.  ప్రశంసనీయము.
    పైవివరములను బట్తి ఇది వ్యవసాయమదారులకు ప్రధానమైన పండుగగా కనిపిస్తు ఉంది.
   కన్నడుగులలో ఈ పండుగను కారుణిపబ్బమందురు.
   ఈ ఏరువాక పున్నమనే సంస్కృత మందు ఉద్వ్సభ యజ్ఞమని పూర్వకాల మందు చేయుచుండిరి.   జైమినీయ న్యాయమాలా గ్రంధమందు