పుట:PandugaluParamardhalu.djvu/139

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఏరవాకమ్మనీ ఏమికోరాలి!
ఎడతెగని సిరులివ్వ వేడుకోవాలి
పాడిపంటలు కోరి పరవశించాలి
ఏరువాకొచ్చింది ఏరువాకమ్మ
ఏళ్లునదులు పొంగి వెంబడే వచ్చాయి.
                 నాగలిపాట
ముదుటేరు దున్నేవాడా
ముద్దులబావ!
దాపటెద్దుకు దాహమాయెను
కాపువదిలావా!
వెనుకనాగలి దున్నేవాడా
ఎర్రపంచెల చెన్నవాడా!
ఎలపటెద్దుకు దాహమాయెను
తెలుసుకున్నావా!
వెండిమురుగులు వెలుగుచూచి
ఎర్రపంచెల షోకుచూచి
తోలవేమో దోరగిత్తని అలసిపోయావా!
ఆపలేక మెట్టనాగలి
ముందు కురులుపైకిచుట్టి
ములుకఱ్ఱా చేతపట్టి
దుక్క్జిదున్నిన దేశమందు
దు:ఖముంటుందా!
కాపునడచిన భూమిమీద
ఏపుతగ్గిందా!
మోటనాగలి8 దున్నుకుంటూ
పాటలేవో పాడుకుంటూ
పాటుపడితే లోటులుంటాయా!
                     సావిత్రీవ్రతం
తిలపాత్రదిదానం మహాజ్యేష్ఠి.
 

సావిత్రీవ్రతం: బంగారముతోకాని మట్టితో కాని సావిత్రీ సత్యవంతుల ప్రతిమలను చేసి యధాశక్తిని పూజించవలెను. రాత్రి సావిత్రి