ఈ పుటను అచ్చుదిద్దలేదు
తుంగభద్రా తీనాన భువనేశ్వరీ అమ్మవారిని గురించి తీవ్రమైన తపస్సు గాయత్రీ మంత్రంతో ప్రారంభించేడు. అమ్మవారు ప్రసన్నురాలై ప్రత్యక్షమయింది. వరం కోరుకోమంది. ఐశ్యరం ఇమ్మని కోరారు. ఈ జన్మలో ఐశ్వర్యం పొందడానికి అర్హతలేదని అమ్మవారు చెప్పింది. అప్పుడు అతడు సన్యసించాడు. సన్యసించి శృంగేరి పీఠాదిపత్యం స్వీకరించి విద్యారణ్య బురుదం వహించాడు. సన్యాసం జన్మాంతం కాబట్టి ఐశ్వర్యం ఇమ్మని అతడు అమ్మవారిని అర్దించాడు. ఆమె ఆ అభ్యర్ధనాన్ని అంగీక రించింది. మూడు గడియల సేపు సువర్ణ వృష్టి కురిపించింది.
అదే సమయానికి హరిహరరాయలు, బుక్కరాయలు అతని వద్దకు వచ్చారు. విరూపాక్షస్వామి పేరిట వారిచే అతడు ఒక రాజ్యాన్ని స్థాపించాడు. భువనేశ్వరీమాత అనుగ్రహించిన అపారధనసపత్తిని అతడు విరూపాక్ష పీఠం నెలకొల్పడానికి విద్యానగరాన్ని పెంపొందించడానికి, విద్యానగర సామ్రాజ్యూన్ని విస్తరింప చేయడానికి వినియోగించాడు.
ఈ రాజుల వద్ద అతడు కొంతకాలము మంత్రిగా ఉన్నాడు. ఆ మీద అతడు శృంగేరీకి వెళ్లి అచటి శంకర పీఠానికి అధిపతి అయ్యాడు. అతడు తన నూట ఇరవయ్యో ఏట సిద్ధి పోందినట్లు చెబుతారు.
విద్యారణ్యుని గుఱించి ముఖ్యముగా తెలుసు కొనవలసిన విషయాలు కొన్ని ప్రముఖులు రచనల నుండి ఇక్కడ క్రోడీకరింపబడుతున్నాయి. విద్యారణ్యనామం ఇది "విద్య ' 'అరణ్య ' అను రెండు పదాల కలయికచే ఏర్పడినది. సరస్ఫత్యపరావతారమగు మాధవచార్యుడే విధ్యారణ్య" యోగపట్టము స్వీకరించి శృంగేరీ జగద్గురు పీఠాదిస్థిడయ్యెను. శృంగేరీ - కామకోటి - విరూపాక్షపీఠములం దధిష్ఠితు లైనవారలు తాము స్వీకరించిన యోగ పట్టమున కంత్యభాగమునందు తీర్ధ -ఆశ్రమ - వన -అరణ్య - గిరి - పర్వత - సాగర - సరస్వతి - బారతి - పూర్వాదిగాగల దశవిధానములందొకటి జేర్చికొనుట యాచారమైయుండెను. ఆపద్దతి శృంగేర్యాదిగాగల జగద్గురుపీఠములందు నేడును గలదు. ఈ దశవిధనామవివరణ మిట్టులున్నయది.
1.తీర్దనామ:-
త్రివేణిసంగమే తీర్దే తత్త్వమస్వాబక్షణే,
స్నాయాత్తత్త్వార్ధభావేన తీర్ధనామా స ఉచ్ల్ల్యతే.