Jump to content

పుట:PandugaluParamardhalu.djvu/130

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పుచ్చుకున్నాక విద్యారణ్య నామంతో ప్రవర్తించాడు.

  పరాశరస్మృతి వ్యాఖ్యానంలో విద్యారణ్యుడు తమ వంశాదికాలను ఇట్లా వివరించాడు.

    "శ్రీమతీ జననీయస్య సంకీర్తిర్యాయణ! పితా
     ప్రాయణం: సోమనాధత్ప మనోబుద్ది సహోదరౌ
     యస్య బోధాయనం సూత్రం శాఖాయస్యచయాజుషీ
     భరద్వాజం యస్యగోత్రం సర్వజ్ఞస్సహి మాధవ:."

   "తల్లి శ్రీమతి, తండ్రి మాయణుడు, సహోదరులు సాయన, సోమనాదులు, బోదాయన సూత్రం, యజుర్వేద శాఖ భారద్వాజస గోత్రము పేరు మాధవుడు.
   విద్యా తీర్ధులు, భారతీ తీర్ధులు, శంకరానందులు మున్నగు వారు ఇతని గురువులైనట్లు తెలియవస్తూఉంది.  'సర్వజ్ఞ విష్ణు ' అనే పేరుగల గురువు గాని దగ్గర వేద, వేదాంత శాస్త్రాలు అభ్యసించినట్లు సర్వదర్శన సంగ్రహంలో ఉంది.
     బ్రహ్మచర్యాశ్రమం నుండే ఇతడు సన్యశించినట్లు చెబుతారు.  కాని ఇతడు చాళుక్య చక్రవర్తి మంత్రి అయిన నీతిహోత్రుని కుమార్తె "నీతిహోత్రి" అను కన్యను తల్లిదండ్రుల ఆజ్ఞానుసారము పెండ్లియాది కొంతకాలము సంసార సాగరమున సంచరించెను. వివాహం ఆయిన నలుబదవ ఏట జరిగింది.  అయినను బ్రహ్మచర్య నిష్ఠాగరిష్టు డగుటచే ఇరువది అయిదు వసంతముల యవ్వనవంతునివలె భాసించెడువాడు." అని శ్రీ పురాణపండ రామమూర్తి గారు అంటున్నారు.
  ఇతని విద్యాభ్యాసకాలమునాటికి దక్షిణ భారతాన ఆర్షమతపరిస్ధితి శోచనీయమై ఉండింది.  వేదశాస్త్రాలు ఆడుగంటాయి.  శ్రౌతస్మార్తవిద్యలు భ్రష్టమైనాయి.  వేదార్ధ విశదీకర్త అంతవరకు ఎవరూ లేకుండిరి.  మత త్రయార్యులు వేదాంత శాస్త్రాన్ని మాత్రమే విస్తరింప చేశారు.  దాని ఫలితంగా ఉపనిషణ్మతం పెడత్రోవల్లో పడింది.  మతం పలుశాఖలుగా చీలిపోయింది.  ఈ పరిస్థితులలో విద్యారణ్య్హుడు అవతరించి వేదమతాన్ని ఉద్దరించాడు.
    ఇతనికి ప్రాజ్ఞత వచ్చేసరికి ఉత్తర హిందూస్థాన మంతా మహ్మదీయుల వశమైంది.  ఆ అన్యమతస్థులు దక్షిణాదిని అక్కడక్కడా పీట పెట్టారు.  ఈ విషయాలు ఇతనిని కలత పెట్టాయి.  అప్పుడు అతడు