పుట:PandugaluParamardhalu.djvu/11

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తాడనీ, తాము ఇక్కడ్ నెలకొల్పే ఈ ధ్వజాలు వాటికి అనుకరణాలనీ మహారాష్ట్రుల విశ్వాసం".

   ఈ రెండు ఆచారాలు ఆంధ్రులలో ఉన్నట్లు కనపడదు.
           (2) తైలా భ్యంగనము
  సంవత్సరారి కృత్యాలలో తైలాభ్యంగ స్నానం అతిముఖ్యమైంది.
 తైలాభ్యంగనమనగా నువ్వులనూనెతో తలంటి పోసుకోవడం.
 సకల శుభ కార్యాలకు ముందుగా తలంటి పోసుకోవడం మన మంత విధుల్లో ఒకటి.
  సంవత్సరంలోని మొదటి పందుగకు అట్టి మంగళస్నానం మరీ ముఖ్యం.
  ఉగాదినాడు ఎవడు తలంటి పోసుకోడో అతదు నరకలోకానికి పోతాడని శాస్త్రవచనం.
  తలంటు వలన శరీరంలోని అన్ని ఇంద్రియములకు పాటవము కలుగుతుంది.  సుఖనిద్ర కలుగుతుంది>
    (3) నవ వస్త్రాభరణధారణం, చత్రచామరాది స్వీకరణం
   సంవత్సరాది నాటి విధాయక కృత్యాలలో కొత్తబట్టలు, కొత్త నగలు, ధరించడం ఒత్తగొడుగు కొత్త విసనకర్ర స్వీకరించడము.  చెప్పబడ్డాయి.
   ఈ పండుగనాడు స్నానం చేసి శుచి అయి కొత్తబట్టలు కట్టుకుని కొత్తనగలు పెట్టుకొని దేహాన్ని అలంకరించుకోవడం మంగళకరమైంది.  సంతోషప్రదమైంది. ఉత్సాహజనకమైంది.
   ఎండాకాలము ప్రారంభంవుతూ ఉంది కాబట్టి ఇప్పటి నుంచి గొడుగు వేసి కోవడం చాలా అవసరము.  కాగా ఉగారినాడు కొత్త గొడుగు సంపాదించి ఉంచుకొనవలెనని హితవు.  చత్రధారణము నేత్ర శాంతికరము: ఎండ, గాలి, వాన మున్నగు వాని నుండి కాపాడి సౌఖ్యప్రదంగా ఉంచును.
   ఉగాదినాడు చామరము కూడా స్వీకరించాలి.  వచ్చేది గాలికోరే రోజులు.  చామరములతో విసురుకోవడం అవసరం, కాబట్టి వింజామరలు సేకరించి భద్రపరుచుకోవాలి. పూర్వం ఇవి బాగా వాడుకలో ఉంటూ ఉండేవి.  ఇప్పుడు వీనిని మనం దేవాలయాల్లో మాత్రం చూస్తున్నాము.  నెడు సంపన్నుల ఇళ్లలో ఎలక్ట్రిక్ ఫంకాలు చోటుచేసుకున్నాయి.  కాని