పుట:PandugaluParamardhalu.djvu/12

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రెండు తావుల్లోనూ వసంతోత్సవ ప్రస్తావన ఉంది. కాని ఒకచోట నింబకుసుమ భక్షణం అనీ, వేఱొక చోట చూతకుసుమ భక్షణం అనీ ఉంది.

  వసంతోత్సవాలు శాస్త్ర్రాల్లో చెప్పిన దానిని పట్టి చూస్తే మామిడి చెట్టు క్రింద్ చేయాలి.  మామిడి చెట్టు క్రిందనడిచే కార్యకాలాపం గల పండుగ నాటి ఇతర కార్యకలాపాల్లో మామిడి పూతవాడకం ఉండడమే సముచితమని తోచకమానదు.
     అయితే వారి ఉగాది నాటికి చూతకుసుమం అరుదై పోతుంది.  శివరాత్రి నాటికే మన ప్రాంతాల్లో మామిడిపూత కాక వేప పూత ఎందుచేత చేకొనబడింది. 
    మన ప్రాంతాల్లో ఉగాది నాటికి చూత కుసుమం అరుదై పోతుంది. శివ రాత్రి నాటిఒకే మన ప్రాంతాల్లో మామిడి  జీడి పిందెలు ఏర్పడుతాయి.
   మామిడి పూతకంటే వేపపూత ఆరోగ్య దృష్ట్యా వరణీయమైంచి.  అదిన్నీకాక మామిడిపూత ఆఘ్రాణింపుకేకాని  ఆరగింపునకు అంతగా పనికి రాదనిన్నీ అనవచ్చు.
    కాగా చూతకుసుమానికి బదులు ఉగాదినాడు మనకు వింబకుసుమ భక్షణం విధింపబడింది.  మనకు ఉగదినడు చూతకుసుమ భక్షణం లేదు.  మామిడి పూతకు బదులు అప్పటికి బాగా దొరికే లేత మామిడికాయ ముక్కలు మనం ఉగాది పచ్చడిలో వేసుకుంటాము.  ఈ విధంగా మనవసంతొత్సవానికి మామిడి సంబంధం.
    మన ఉగాది నాటికి వేపచెట్లు ముమ్మరంగా పూతపూసి ఉంటాయి.  వేపపువ్వు గుణవంతమైన ఓషది.  రక్తం ను శుద్దిచేసి వృద్ధి పరిచేగుణం దానికి ఉంది.  పైగా అది వసంత ఋతుసంబంధమైన పువ్వు.  వైద్యానికి ఉపయోగించే వేపచెట్టు పంచాంగాల్లో అది ఒకటి.
     వేప సర్వాంగాలుమనవారు వైధ్యంలో వాడతారు.  మానవునికి ఆరోగ్యం కూర్చే వృక్షాల్లో వేప ఎన్నిక అయింది.  స్వర్గలోకంలోని Ambrosia వృక్షం యొక్క అంశతో భూలోకంలో వేప చెట్టు పుట్టిందని మహారాష్ట్ర సంప్రదాయక విజ్ఞానం ద్వారా వెల్లడి అవుతూ ఉంది.
    వేపచెట్టుగాలి కూడా ఆరోగ్య ప్రదమై ఉంటుంది.  దీనికి నిదర్శనంగజ మన పెద్దలు ఒక కధ చెబుతారు.