పుట:PandugaluParamardhalu.djvu/10

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాడు పూర్వం మనదేశాన ప్రతియింట ఎ ధ్వజారోహణోత్సవాలు సాగుతూ ఉండేవి.

     కొన్ని వ్రత గ్రంధాల్లో ఉగాదినాడు బ్రహ్మధ్వజాన్నికాని, ఇంధ్రధ్వజాన్ని కాని పూజించాలని ఉంది.
    ధ్వజారోహణకృత్యం ఆంధ్రుల్లో అంతగా ఆచరణలో లేదు.  ఆనాడు గృహాలను శుబ్రపరచి గుమ్మాలకు మావిడాకులు కట్టడం మాత్రమే ఇప్పట్లో ఆంధ్రుల ఆచారమై ఉంది.
   కాని ధ్వజారోహణోత్సవం మన పొరుగు వారైన మహారాష్ట్రులు ఈనాడున్నూ ఆచరిస్తున్నాదు.  ఈ సందర్భంలో హిందువుల పర్వాలు (హిందూ హాలిడేస్) అనే గ్రంధంలో కొధారి అను మహారాష్ట్ర మాన్యుడు ఇట్లా వ్రాస్తున్నాడు.
      ఆంధ్రులలాగే "మహారాష్ట్రులు కూడా శాలివాహన శకాన్నే అవలంబిస్తారు.  చైత్రమాసాది దినమే మహారాష్ట్రులకున్నూ సంవత్సరారి దినము.
     కొత్తగా ఇల్లు కట్టడానికి కాని, కొత్తగా ఏపనిని ప్రారంభించడానికి కాని ఇది చాలా శుభదినమని మహారాష్ట్రుల నమ్మిక.
    వారి తమ ఉగాదిదినాన్ని "వర్షప్రతిపదపర్వమనీ" "గుడి పర్వ" సర్వమనీ, ధ్వజారోహణపర్వమనీ అంటారు.
    నాటి ఉదయాన్ని మహారాష్ట్ర స్త్రీలు తమ యింటి ముంగిళ్ల ముందు పేడనీళ్లు చల్లి ముగ్గులు పెడతారు.  ఆ ముగ్గులు మీద మధ్యను చౌరంగం అనే కర్రపీట ఉంచుతారు.  ఆ పీటమీద మధ్యను నీళ్లతో నింపిన పాత్రను నెలకొల్పుతారు.  ఆ పాత్రలో ఒక రూపాయి వేస్తారు.  ఆపాత్రమీద ఒక టెంకాయ నిలువుతారు.  పూజ చేస్తారు.  అనంతరం మధురమైన భక్ష్యాలు భుజిస్తారి.
   ఆనాడు మహారాష్ట్రులు తమ యింటి ముందు ఒక ధ్వజాన్ని కూడా నెలకొల్పుతారు.  దానిమీదవెండిదో, రాగితో, ఇత్తడిదో పాత్రను ఉంచుతారు.  బంగారు జరీపోగులు గల పట్టు పీతాంబరాన్ని ఆ ధ్వజానికి చుట్టబెడతారు.  ఆ ధ్వజానికి మరి కొన్ని జెందాలు, పూలగుత్తులు కూడా కడతారు.
    ఇంధ్రలోకంలో ఇంద్రుడు ఈనాడు ఇట్టి ధ్వజసంభాలను నెలకొల్పు