పుట:Pandrendu-Raajula-Kathalu.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

96

పండ్రెండు రాజుల కథలు


పదునొకండవ నాటి రాత్రికథ.

అనుదినాభ్యాస ప్రకారంబున, పదునొకండవనాటి సాయంసమయమునఁగూడ యమునాతీరమున నాసీనుడై నరుఁడు నారాయణుం దిలకించి, పదునొకండవ వేదాంతమార్గమగు ఎఱుక నెఱుకఁ జేయుమని వేడ మాధవుం డిట్లువక్కాణించెను.

రాజ శేఖరమహారాజు కథ

పాండు రాజకుమార! సనాతన కాలంబున, కాశ్మీర దేశంబున, దిలీపభూపతికి రాజశేఖరుండను కుమారుఁడును, రాజముఖియను పుత్రికయు నుండిరి. దిలీపభూపతి, పుత్రునకు చతుషష్టి కళలను, చతుర్వేదములను, అష్టాదశవిద్యలను, సాముగరిడీలను మున్నగు వానినెల్ల చతురులగు నుపాధ్యాయులచేఁ జెప్పించి ప్రవీణుం జేసెను. సకలవిద్యా రహస్య వేది యయ్యును రాజశేఖరుండు తన మదికి నచ్చిన కన్య లభింపమింజేసి, యవివాహితుఁడై నిరంతర గ్రంధపారాయణ పరాయణత్వమునఁ గాలముఁ బుచ్చుచుండెను.

ఇదియిట్లుండ భూలోక సంచారముం జేసి స్వర్గమునకుఁబోవుచున్న నారద తుంబురు లిరువురును గగనమార్గమునఁ గలసికొనిరి. అన్యోన్య కుశల ప్రశ్నానంతరము నారదుఁడు తుంబురునిఁ దిలకించి, "భూలోక వార్తలే "మని ప్రశ్నింప నాతఁడు “మిత్రమా! ఏమని చెప్పుదును? కాశ్మీర దేశాధిపతికి, రాజశేఖరుఁడను నొక కుమారుఁడు గలఁడు, వానిని సౌందర్యమున కంతు వసంత జయంతాదులైన గెలువఁజాలరు. ఇంతకన్న విశేషముగలదా?" యని పలుక, నారదుఁడు పెదవి విఱచి “ఆసౌందర్యమునే ఘనముగాఁ బొగడుచుంటివి. నేపాళ దేశాధిపతియగు ననంగసేనునకు, అనంగ సేన యను పుత్రికగలదు. దాని సౌందర్యముం