పుట:Pandrendu-Raajula-Kathalu.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ధర్మపాలమహారాజు కథ

93


కొందఱు భటులు సాయుధులై యాతనిఁ జుట్టుముట్టిరి. దుస్సహం బగు నా యవమానమును సహింపఁజాలక, ధర్మపాలుఁడు కాలరుద్రునిగతిఁ గరవాలమును కేల గీలించి, తన పరాక్రమంపు పెంపున తన్ను గవియ వచ్చిన వారి నెల్లర జీకాకుపఱచి, యెవ్వరికిం దొఱుకక నాపురంబు నిర్గమించి నేమంబుగ నవలంబడెను.

అట్లు పలాయితుండై చనిన, ధర్మపాలుఁడు, మహా భయంకర మగు నొక యరణ్యంబు నంబడి పోవుచు, రతీరమణి కెనయగు రూపలావణ్యములతో నొప్పారు చిత్రాంగదాపాణిగ్రహణ భాగ్యముతనకొక్క ఱెప్పపాటు కాలంబున దప్పిపోయేఁ గదాయని వగచుచు, క్షుత్పిపాసలపై భ్రాంతిసయితము మాని, యొక వృక్షమూలంబున కానుకొని మహావిచారంబు సేయుచున్నంత నాతనికట్టెదుట, సాక్షాత్కరించిన యపరరుద్రుం డోయన నొప్పు నొక మునీంద్రుఁడు ప్రసన్నుండయ్యె. అతనింగాంచి సంభ్రమవినయంబులుదోప నానృపసూతి యాతనికి నమస్కరింపనాతఁడా బాలుని దీవించి, దివ్యజ్ఞానమున, నాతని పూర్వవృత్తాంతము నెల్ల నెఱింగి, “రాజనందనా! పాపనిరయమగు నంగనాసంగమ లౌల్యంబున నిట్లు విచార పరీతస్వాంతుఁడనై యా మష్మికోత్తమపదంబును, జెఱుచుకొన దగునా! ఊరడిల్లుము నన్ను పతంజలి యందురు. నీవు సజ్జనుండ వని నామదికిం దోఁచెగావున నీకు మానవదుర్లభంబగు, దర్పణమహాత్యంబు నెఱింగించెదరు. తన్మూలమున తరింపఁగల"వని తనయాశ్రమంబునకుఁగొనిచని, యుపదేశించెను.

అనిపలుక పార్థుఁ డాశ్చర్యపడి, "గోవిందా! అనంతర మాధర్మపాలుని చరిత్రం బేమయ్యె నెఱిఁగింపు"మని పలుక 'ననంతర కధావిధానంబును ముకుందుఁ డిట్లెఱిఁగించెను.

అర్జునా! వినుము—— దర్పణ ప్రభావము నెఱింగి ధర్మపాలుండాముని యందు మహావినయంబు గలుగ నితర ప్రపంచ సంబంధములను బరిత్య