పుట:Pandrendu-Raajula-Kathalu.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

94

పండ్రెండురాజుల కథలు,


జించి యాతని పాదసేవం చేయుచు నా యాశ్రమంబుననే యుండెను. ఇక్కడిస్థితి యిట్లుండ ఘూర్జర దేశమున మత్స్య యంత్రముం గొట్టిన ధర్మపాలుని చరిత్రము సమస్త దేశములందును వ్యాపించేను, ఆవార్త నొకదాసి యాలకంచి, రహస్యంబుగఁ గాంతిమతి కెఱిఁగింప, నామె పెద్దతడవు యోచించి, ధర్మపాలుఁడు మరణింప లేదనియు నిందేదియో మోసము జఱిగెననియు విశ్వసించి, తన కాంతరంగికుఁడగు నొక మంత్రవేత్త కీ వృత్తాంతమెల్లఁ దెల్పి ధర్మపాలునిజంపి యాశిరస్సును నాకుఁజూపినచో, నీ కశేషంబు ధనంబు నర్పింతునని యాశ పెట్టి పంపెను. ఆమాంత్రికుఁడును, బహుదేశంబులు దిఱిగి, తిఱిగి తుదకు, పతంజల్యాశ్రమంబునకువచ్చి, ధర్మపాలుం గనుంగొని యానందించి, యాతనితో కపట స్నేహంబు నటించి, సంహారోపాయము నాలోచించు చుండెను. ఇది యిట్లుండ నచట ఘూర్జర దేశంబున, రాజపుత్రిక యగు చిత్రాంగద ధర్మపాలునిపైఁ గల మోహంబున వ్యాధి గ్రస్తయై మరణాసన్న యయ్యెను. ఏక పుత్రికా జీవనుఁడగ, నావిక్రమాఁకుఁడు చేయునది లేక పుత్రికా ప్రాణ సంరక్షణార్ధమై— పూర్వ వైరఁబును మజచి, మహారాష్ట్ర భూమీశుఁడగు, కీర్తిపాలునితో సమాధానపడి, "నాపుత్రికను నీకుమారుఁడగు ధర్మపాలున కిచ్చి వివాహమొనరింతును. తరలిరావలయు" నని కబురంపెను. అప్పటికి పుత్రశోకంబున, ధర్మపాలుని తల్లియగు, ఊర్మిళా దేవి స్వర్గస్థురాలగుటం జేసి, కాంతిమతి గీచినగీటు దాటక వృద్ధరాజు చరించు చుండెను. ఘూర్జర భూపాలుని సందేశమును విని, కాంతిమతి ప్రోత్సాహమున రాజు వీరపాలుంజూపి, వీఁడే ధర్మపాలుడని పలికి మహావైభవంబునఁ దరలివచ్చుచు మధ్య మార్గంబున నొక్కచో, విడిసెను. ఆ ప్రదేశంబు మతంజల్యాశ్రమమునకు మిక్కిలి చేరువగా నుండుటయు, నారాత్రి 'వెన్నెల పిండారఁబోసినగతి ప్రకాశించుచుండుటయు, వీరపాలుఁడు తనతల్లి దౌష్ట్యమును పూర్వచరిత్రమును అప్పటి తన పరిణయంబును తలంచుకొనుచు, తన సోదరుఁ డెందుండెనో తెలియక యా వనం