పుట:Pandrendu-Raajula-Kathalu.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

92

పండ్రెండురాజుల కథలు


సయిత, మా మత్స్యయంత్రవాత౯ నాకర్ణించి, దానిని భేదింప నుత్సహించి, రాజప్రాసాదమున కరిగి, యందు సాంకేదికముగానున్న గంట వాయించెను. ఘంటా నినాదమును విని, ఘూర్జర దేశ మంత్రి యటకరుదెంచి, తాను దగ్గరనుండి, ధర్మపాలున కామత్స్యయంత్రముం జూపెను. ఘంటాధ్వని వినంబడినంతనే, పురజను లనేకులందు గుములుగూడిరి. ధర్మపాలుఁ డామత్స్యయంత్రమును సర్వజన సమక్షంబున, సునాయాసముగా 'భేదింప, పురవాసు లందఱును, జయజయధ్వనులు నభోతలంబంట, నీతడు సురయక్షగరుడ గంధర్వాదులలో నెవ్వఁడో కాని, మానవ మాత్రుండు గాఁడని ప్రశంసింపఁజొచ్చిరి. సచివుఁడా రాజపుత్రుని మహావైభవంబున, విక్రమాంకుని సన్నిధికిం గొని పోవుచుండ, నాభూపాలుఁడే సన్మానపురస్సరంబుగ నెదురుగా వచ్చి, యాతని యిష్టమాలికాదులచే బహూకరించెను. చిత్రాంగదయు, సాలంకృతయై సౌధాగ్రమున నిలిచి, భూమి నవతరించిన, కంతుఁడో జయంతుఁడో యనుమాడ్కి, యసమానతనుద్యుతులతో వెలిగిపోవుచున్న ధర్మపొలుందిలకించి, మన్మధశరాహత మానసయై యాపుణ్యాత్మునిఁ బ్రాణపతిగాఁ గాంచఁగల్గిన తన యదృష్టం బసామాన్యమని యుప్పొంగుచుండెను ఘూర్జరాధిపతి, ధర్మపాలుని నిజాస్థాన మంటపంబునకుం గొనిచని యాతని సన్మానించి, పుణ్యాత్మా! నీకాపుర మేపురము? నీతల్లిదండ్రులై ధన్యులైన పుణ్య దంపతు లెవ్వరు? యష్మన్నామధేయంబునం బవిత్రతఁగన్న పుణ్యాక్షరంబు లెయ్యవి?" యని ప్రశ్నింప, నాతఁడు తమ కారాజు పూర్వవైరి యగుట నెఱుంగమిం జేసి, దాచక తన యుదంతం బెల్ల నెఱింగించెను. అంత నాయిలాపతి, తమ పూర్వ విరోధంబులను స్మృతికిఁ దెచ్చుకొని, దండ తాడిత మహారగంబుగతి మండిపడి, "యోరీ! నీవు నా విరోధి కుమారుఁడవు మోసగించి, నాపుత్రికం బరిణయమాడ నిందువచ్చితివా? ఇప్పుడొంటరిగ నాచేతఁజిక్కితి విఁకనెందు బోవఁగలవు?—— భటులారా! వీనిని బంధించి కారాగృహ నిబద్ధునిఁ గావింపుఁ"డని పలుక, వెంటనే,