పుట:Pandrendu-Raajula-Kathalu.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ధర్మపాలమహారాజు కథ.

91


శ్రేయస్కరముకాదు కొన్ని దినము లెందైన కాలముం గడిపితివేని,మఱల తగుసమయంబున రాదగును. నాహితంబు విను"మనిపలుక, నాతఁడు దూరమాలోచించి, యందుల కనుమతించి, యట్లే పురంబు వాసి యెందేనిం జనియెను. అంతట వీరపాలుఁడు ఖడ్గంబునఁ దన చేతిని గోసికొని, దానిపై కట్టు గట్టుకొని, తత్తరపడుచు పురంబునకరిగి, రాజ ద్రోహులు యువరాజును చంపి, కందకమున బారవై చిరనియు, తానెదురింప చేతికి గాయమయ్యే ననియుఁ గల్పించి చెప్పెను. ఆఘోరవార్త నాలకించి, యూర్మిళాకీర్తిపాలురు మొదలునరికిన కదళీ తరువులగతి, సోకనిమగ్నులై పోయిరి——మంత్రి యీవార్తను నమ్మఁజాలక , కందకమున వెదకించెఁగాని యువరాజు కళేబరమెందునుఁ గానరాదయ్యెను. కాంతిమతీ దేవికిఁ గన్నులు చల్లనయ్యె——

ఇచ్చటి వృత్తాంతంబిటులుండ, నట్లు పురంబు వెల్వడి చనిన ధర్మపాలుండా రాత్రియెల్ల వీరపాలుఁడు తనకిచ్చి చినిన కరవాలసహాయమున, మహారణ్యమద్యమునం బడి యారాత్రియెల్ల దీర్ఘ ప్రయాణంబోనరించి, 'తెల్లవారునప్పటికీ, ఘూర్జర రాజ్యముం జొచ్చి, తద్రాజధానిం బ్రవేశించి, యొక ధర్మసత్రంబున విడిసియుండెను. ఆకాలమున, ఘూర్జర దేశమును, విక్రమాంకుఁ డనురాజు పరిపాలించుచుండెను. ఘూర్జర దేశాధిపతులకును, మహారాష్ట్ర రాజులకును, చిరకాల వైరములు రవుల్కోను చుండెను. విక్రమాంకునకు, చిత్రాంగద యను, నవ వయస్కయగు పుత్రికారత్నము గలదు. విక్రమాంకుఁడు మానవాసాధ్యమగు, మత్స్యయంత్రము నొకదానిని, నిర్మించి, దానిని భేదించిన వీరునకు చిత్రాంగద నిచ్చి వివాహం బొనరించెదనని వాగ్దానము చేసెను. భూమండలమునంగల రాజ లోకంబెల్ల బీరంబులాడుచు, నటకరు దెంచి, యసాధ్యమగు నాయంత్ర మీనమును దర్శించి, “యోహో! దీనిని భేదింప మనుష్య మాత్రుల కలవి యగునా? ఈ రాజు మనలనందఱ నవమానింపఁదలంచి, యీ తంత్రముం బన్నె "వివిధగతుల, నాక్షేపించుచు వెడలిపోయిరి. ధర్మపాలుఁడు