పుట:Pandrendu-Raajula-Kathalu.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

84

పండ్రెండు రాజుల కథలు


బోవుచు, దేవలోకమున రాక్షస సంహారమునకై యతితీవ్రయత్నములు జఱుగుచున్నట్లు తమలో సంభాషించుకొనిరి. ఆ ప్రసంగమునంతను మన శుక రాజమగు శుచిముఖి యాకర్ణించి నాతోఁ జెప్పినది. ఆ మాట వినిన గడియ మొదలుగా నాచిత్తము నీ విషయంబున తత్తరించుచున్నయది. నీవు నన్నొంటిగ నిందువదలి రేలం దిరుగఁబోవుచుందువు. అట్టియెడ నీ కపాయముగల్గిన నాకేదిగతి!" యని వగవఁ దొడంగెను. ఆ పలుకులు విని యా రాత్రించరి పెద్ద పెట్టున నవ్వి——"యోసి వెఱ్ఱి పిల్లా! ఇదియా నీ విచారము! నా ప్రాణముల కేమియు భయము లేదు. వగవకుము; ఇచ్చటికి నూఱుయోజనముల దూరమునందు. దధిసముద్ర మధ్యంబున నున్న ప్రవాళద్వీప మధ్యమున బహుతరోన్న తంబగు నొక తాళవృక్షము గలదు. దానిపై "జ్వాలాముఖి" యను నగు నోక శ్వేత కీరము వసించుచుండు. తత్కీరము నోటనున్న బరిణయందు నాపంచ ప్రాణములును, ఐఁదు తుమ్మెద లై యున్నవి. వానిం జంపినఁగాని, నేను మరణింపను. అవి యన్యులకు సాధ్యమగుట స్వప్న వృత్తాంతము కావున పగవం బనిలే" దని పలికి మణిమాలతో గొంతతడవువినోదముగఁ బ్రసంగించి యధాప్రకారంబుగ నిదురింప నరిగెను. ఆనాటి నిశాసమయంబున నేకాక్షి, మరల సంచారంబున కరుగగనే మణిమాల బల్లిని రాజపుత్రునిగా మార్చి యాతనితో నిఫ్ట్వేచ్చమదనవ్యాపారక్రియం దవిలి గంటలు నిమిషములుగా గడిపెను. ఆమహానందమునఁ బొద్దుగ్రుంక వచ్చుటయు వారు మఱచిరి.అంత సూర్యాస్తమయం బగు మణిమాల తెలివి దెచ్చుకొని" మనోరమణా! దానవి తనజీవన రహస్యంబెల్ల నా కెఱిఁగించినది. రేపటిదినమున నా ప్రియశుక రాజమగు శుచిముఖిని ప్రవాళ ద్వీపమునకంపి, యాబరీణం దెచ్చు ప్రయత్నం బొనరింతు"నని రాక్షసిని సమయంచునుపాయంబులఁ గొన్నిటినాలోచించుకొని, మరల నాతని బల్లినిగా మార్చి వెనుకటి రీతి నారాక్షసివచ్చినంత నమ్మకంబునఁజరించెను. మఱునాడు, శుచిముఖి, మణిమాలకడ సెల