పుట:Pandrendu-Raajula-Kathalu.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విక్రమసేనమహారాజు కథ

85


పంది రయంబున నంతరిక్ష మార్గంబున వాయువేగమనో వేగములంబురు డించుజవంబున మూఁడుజాముల కాలంబులోన, నాప్రవాళ ద్వీపముం జేరి, యెట్ట కేలకు తత్తాళమహీజమును వ్రుక్షాగ్రమున చూళికాసహితయై యున్న కీరమునుంబొడఁగాంచి, హృదయోత్సాహంబు రెట్టింప, ఱివ్వున దానిపై కెగసి, యంతకుమున్నే తన వెంట గొనిచనినబరీణ నందునిచి, బాంధవ్యానురాగం బుట్టిపడు తెఱంగున, “నోయల్లుఁడా! చిన్నతనంబున నెన్నడో నినుఁజూచుటయేగాని, మఱల నినుగాంచు భాగ్యం బబ్బదయ్యె! ఎన్ని నాళ్లకు నినుగంటిని! పారతంత్య్రజీవనం బొనగించు నిర్భాగ్యుల గతులిట్టివియేకదా! ఆహా! నేడు నాకన్నులకఱవుదీరె"నని బిగ్గ నాలింగనం బొనరించె! __ శుచిముఖిమాటల కాశుకంబు విస్మయము దోఁప, తెల తెలంబోవుచు తననోటియందలి బరిణను శుచిముఖయుంచిన బరిణకడనుంచి, “అయ్యా! నీ వెవ్వఁడివో నే నెఱుంగమికి లజ్జించు చున్నాను! మన బాంధవ్యం బెట్టిదియో వచించి నా కానందముం గూర్పుము” నావుడు శుచిముఖి, “అల్లుఁడా! నీవు నా చెలియలగు మధురస్వన కుమారుండవుగావె! నిన్ను చిన్న నాటనే యీదానని యిందుగోని వచ్చియుంచినది ? నీవలెనే నీతల్లియు దండ్రియు, నేనునుంగూడ, యీ దానవీ సహోదరుల ప్రాణరక్షణ మాళికల ముక్కులంగఱచుకోని వేఱ్వేఱు ప్రదేశములం దున్నారము. నేను, ఏకాక్షీ సహోదరియగు, రక్తాక్షి ప్రాణరక్షణ చూళికంగొని శింశుమారద్వీపమునందలి తాళంబున వసించువాడను. నేను నీ మేనమామను,నన్ను రక్తకంఠుడందురు. నిన్నుఁ జూచు పేరాశతో, చూళికను నోటఁగఱచుకొనియే వచ్చితి"నని పలికెను. అంత నాశుకము శుచిముఖితో ప్రియంబునఁ గొంత కాలము భాపింప, నప్పటికితడవగుటయు, శుచిముఖియుపాయంబున, దాఁ దెచ్చిన బరిణనటవిడచి యేకాక్షి జీవంబులుగల బరిణను నోటంగఱచుకొని, అల్లుడా! తడవయ్యె! పోయివచ్చెద! ఇట్లే తీఱికయైనపుడెల్ల నిన్ను జూచిపోవువాఁడ! దయయుంచు” మనవుడు నాశుకంబు తన మామ