పుట:Pandrendu-Raajula-Kathalu.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జీమూతవాహనమహారాజు కథ,

79


పాటున మేల్కాంచిన చారుదత్తుఁ డాకామినీరూపరాక్షసిం గాంచి, యసహ్యమును భీతియుముఖంబునందోప, విపుల తనకందించు భోజ్యపదార్ధంబుల పళ్లెరంబును కాలందన్ని—— దూరంబుగనరిగి—— యోసీ! కులటా! నేటికి పదునారు వత్సరములకు పూర్వము నన్ను కామించి నీదోషమును క్రమ్ముకొనుటకై తదపరాధంబును నాపైఁద్రోసి, సుగుణఖనియగు మహారాజుంబ్రేరేపి నన్నీ చెఱసాలం ద్రోయించి నేటివఱకును బాధించుచుంటివి. గర్భవతియగు నాభార్య యేమయ్యెనో నే నెఱుంగను. ఇంకను నన్ను వదలక దురాశబూనియుంటివి. నాజీవితమంతయు నీచెఱసాలలో వ్యర్థమైనది. నాకుటుంబము నీమూలమున నాశమైనది. వయస్సుమీరి కారాగారమున వికారాకృతిందాల్చియున్న నాపై నింకను నీకెట్టిమోహమో తోపకున్నది. నీవు వేయేండ్లు తపంబొనరించినను నేను నిన్ను కామించి రాజద్రోహినికా"నని దృఢ స్వరంబునఁ బలికెను. అంత నావగలాడి యనేక విలాసచర్యల నొనరించుచు నాతనిడగ్గణి, “మోహనాంగ నీకొఱకై నాజీవితము నంతను ధారపోయుచున్నాను. రాజకుమారుని జీవితములను హరింప మత్స్యగర్భగతంబగు తారహారంబు నపహరించి కృత్రిమహారంబు నంపితిని. అందుచే రాజనందనుఁడు సమసెను. వృద్ధరాజు నొకలిప్తమాత్రంబున సంహరించెదను. నిన్ను రాజుం జేసి నేను రాణినయ్యెదను. నామనవి యాలింపు"మని వేడుకొన, చారుదత్తుఁడు దాని నీచయత్నంబుల కానందింపక బహుప్రకారముల దూషించెను. తద్దూషణముల కాగ్రహించి, విపుల తన కటారిందీసి వాని వక్షమునం బొడువఁబోయెను, ఇంతలో చాటునవేచియున్న ప్రచండాదుల రుగు దెంచి, చారుదత్తుని రక్షించి విపుల నెదిరించిరి. విపుల భయభ్రాంతయై భూ బిలమునంబడి పలాయితయగుట కుద్యుక్త యయ్యెను. కాని యామార్గమున రాంజేంద్రుఁడు సపరివారుఁడై కాన్పించి "కులటా! ఎందుబోయెదవు నిలువు" మని గర్భనిర్భేద్యంబుగఁబలికెను. తనరహస్యమంతయు వెల్లడియయ్యెనని గ్రహించి, విపుల