పుట:Pandrendu-Raajula-Kathalu.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

78

పండ్రెండురాజుల కథ.


తలి నొరగెను. తద్వైపరీత్యముంగని జగన్మోహిని శోకింప నారంభిచెను. ఇంతలో చారుడుగొనివచ్చిన ముక్తాహారము గని రాజేంద్రుఁడు మహానందమున కుమారునిచే నద్దానిధరింపఁ జేయు నభిలాషంబున వెదకుచు సపరివారుఁడై తత్ప్రమదోద్యానంబున, కరుదెంచెను. అప్పటికా బాలునకు పోడశవర్ష పరిసమాప్తి యైనకతంబున దన్మృతికంతగా విస్మ యమందక రాజును పరివారంబును ముక్తాహారంబు నాతని మెడనిడిరి. ఐనను బాలుఁడు లబ్ధజీవితుఁడు గాఁడయ్యెను. ఆవైపరీత్యమునకు రాజదంపతు లడలి దుఃఖింపసాగిరి, రాజపరివారము మృతరాజపుత్రుని సమీపంబున శోకించుచున్న జగన్మోహినింగని సంశయించి——" రాజేంద్రా ! ఈ యాటవిక బాలిక యొక మాంత్రికురాలని తోఁచుచున్నది. దీనివలన నెద్దియో మోసము ఘటిల్లెను. కాకయుండిన రాజకుమారుఁడు జీవింపమి కేమి కారణము? దీనింబ్రహరించిన నిజము తెలియు"నని పలికిరి. జగన్మోహిని నిజవ్రుత్తాంతముం దెలిపినను వారు విశ్వసింపక ప్రహరింప నుద్యుక్తులైయున్న తరి నయ్యెడకు—— భగవానుండగు, మాండవ్యుం డరు దెంచి వారి వారించి, “ రాజేంద్రా ! ఈ బాలిక నిరపరాధిని; ఈవిపరీతంబునకు మూలకారణం బగువ్యక్తి వేఱుగానున్నది. బాలునిభద్రముగ నొకచో నుంచి, నేటి రాత్రి నీవు సశస్త్ర పరివారంబుగ నా వెంట నేఁ జూపుచోటికి రావలయును. అట నతిచిత్ర దృశ్యముం గాంచఁగలవు; బాలునకు భీతిలే" దని పలికెను. చిరకాలప్రవర్ణితంబగు విపులాదేవి పాప మానాటితో పండిపోయెను. మాండవ్యమునీంద్రాదేశానుసారముగ చోరమార్గంబున, సశస్త్రపరివారుఁడగు ప్రచండుఁడు మున్ముందుగ కారాగృహముం జేరి యందందు పరిజనుల నిగూఢంబుగ నిలిపి తానొకచో దాగి, యుండెను. అనంతరము మాండవ్య సహచరులై రాజును పరివారమును శస్త్ర సహితంబుగ నొకచోనుండిరి. అందఱును విపులరాకకై వేచియుండ నట్ట నడు రేయి, నాజారిణి భూబిలమార్గంబున, భక్ష్యభోజనాదులంగొని యటకరుదెంచి మెల్లననిద్రించు చారుదత్తుని తట్టి లేపెను. నిద్రలో నులికి